జూన్ 20 థియేటర్స్ లో విడుదలైన శేఖర్ కమ్ముల కుబేర చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల నుంచే కాదు ఆడియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన కుబేర తమిళనాట డిజాస్టర్ గా నిలిచింది. హిందీలోనూ కుబేర పెరఫార్మెన్స్ అంతగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో కుబేర కుమ్మేసింది... 100 కోట్ల పోస్టర్ తో కళకళలాడింది.
ధనుష్ నటనకు, నాగార్జున దిలీప్ కేరెక్టర్ కు ప్రేక్షకులు ముగ్దులయ్యారు. అయితే కుబేర చిత్రం థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల లోపే అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. హిట్ సినిమా అయినా చాలా త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రావాడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కుబేర చిత్రాన్ని వీక్షించిన ఆడియన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించడం హాట్ టాపిక్ గా మారింది. కుబేర ను ఓటీటీలో చూసిన వారు పెదవి విరుస్తున్నారు. ఈ చిత్రం థియేటర్స్ లో ఎలా హిట్ అయ్యింది, కుబేర నిడివి బోర్ కొట్టేసింది. కథలో కూడా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ లేవు. ధనుష్ చివరి వరకు అమాయకంగా కనిపించడం తమిళ ఆడియన్స్ కు నచ్చలేదు. అదే నిజం.
నాగార్జున కేరెక్టర్ బావుంది. కథలో ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు లేవు, బలమైన ఎమోషన్స్ లేకపోవడం కుబేర కు మైనస్ అనడమే కాదు.. అనవసరంగా మూడు గంటలు టైమ్ వేస్ట్ అంటూ ఓటీటీ ఆడియన్స్ కుబేర చిత్రం చూసాక కామెంట్స్ చేస్తున్నారు.