ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపి మిథున్ రెడ్డి ని సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసారు. లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్న మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేసిన పోలీసులు. మిథున్ రెడ్డి అరెస్ట్ పై పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మిథున్ రెడ్డి ని కోర్టులో హాజరుపరిచే అంశంపై కాసేపట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో 300 పేజీల ఛార్జ్ షీట్ తయారు చేసిన సిట్ 100 కు పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు సేకరించారు, ఏ కేసులో 62 కోట్లు సీజ్ చేసినట్లు వివరణ ఇవ్వడమే కాకుండా 100 కు పైగా ఎలెక్ట్రానిక్ పరికరాలు అప్పగించడం హాట్ టాపిక్ అయ్యింది.
సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో 268 మంది సాక్షుల వివరాలను పొందుపరిచారు. కానీ ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ లో మిథున్ రెడ్డి పేరును పొందుపరచలేదు, మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే రెండో ఛార్జ్ షీట్ లో మిధున్ రెడ్డి పేరు చేర్చే అవకాశం. ఆ ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించిన సిట్ అధికారులు.