సెలబ్రిటీ జంటల విడాకుల గురించి నిరంతరం ఏవో వార్తలు వినాల్సి వస్తోంది. అయితే అన్యోన్యంగా ఉన్నారు అనుకున్న జంట కూడా విడిపోతుంటే దానిని అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఇటీవల కొంత కాలంగా హన్షిక మోత్వానీ తన భర్త సోహేల్ ఖతురియా నుంచి దూరంగా నివశిస్తున్నారని కథనాలొస్తున్నాయి. హన్షిక 2023 నుంచి సోషల్ మీడియాల్లో తన భర్తతో కలిసి ఉన్న పోస్టులను షేర్ చేయడం లేదు. స్థబ్ధుగా ఉంది. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసింది. సోషల్ మీడియాల్లో దానిని షేర్ చేసింది. ఆ తర్వాత తన భర్తతో లైఫ్ గురించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడం అనుమానాలు రేకెత్తించింది.
పైగా హన్షిక తన తల్లితో కలిసి ఉంటే, సోహేల్ విడిగా తన కుటుంబంతో నివశిస్తున్నాడు. పెళ్లయిన ఏడాది తర్వాత సోహేల్ కుటుంబంతో సర్ధుబాటులో హన్షికకు సమస్యలు తలెత్తాయని, దాంతో వారు ఉండే భవంతిలోనే మరో కొత్త ప్లేసుకు మారారని కూడా గుసగుసలు వినిపించాయి. కతూరియా పెద్ద కుటుంబంతో హన్షిక ఇమడలేకపోయిందనేది ఒక గుసగుస. రెండేళ్ల వైవాహిక బంధంలో సమస్యలు తలెత్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సోహేల్ ఖతురియా ఇప్పుడు మౌనం వీడారు.
అతడు చాలా సింపుల్ గా `ఇది నిజం కాదు` అని కొట్టి పారేసాడు. సోహేల్ హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ విడాకుల పుకార్లను తోసిపుచ్చారు. కానీ హన్సిక నుండి విడివిడిగా నివసిస్తున్నట్లు వస్తున్న పుకార్ల గురించి నోరు విప్పలేదు. హన్షిక తన తల్లితో కలిసి జీవిస్తుండగా, సోహేల్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. డిసెంబర్ 2022లో ఈ జంట వివాహం చేసుకున్న అనంతరం సోహేల్ కుటుంబంతో కలిసి నివసించారు. అయితే, పెద్ద కుటుంబంతో సర్దుబాటు చేసుకోవడం సమస్య.
కాబట్టి వారు అదే భవనంలోని కాండోలోకి మారారు. కానీ సమస్యలు కొనసాగాయని సోర్స్ వెల్లడించింది. ఈ జంట 4 డిసెంబర్ 2022న జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్, ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాల్లో నిరంతరం యాక్టివ్ గా ఉండే హన్షిక 2023 నుంచి భర్తతో ఉన్న ఒక్క ఫోటో కూడా షేర్ చేయకపోవడంతో సందేహాలు మొదలయ్యాయి. కానీ బ్రేకప్ వార్తలను హన్షిక కానీ, సోహేల్ కానీ ధృవీకరించలేదు. ఇప్పుడు సోహేల్ అవన్నీ నిజాలు కాదని అన్నారు.