Advertisementt

షారుఖ్ కు ప్రమాదం-అమెరికా తరలింపు

Sat 19th Jul 2025 03:15 PM
shah rukh khan  షారుఖ్ కు ప్రమాదం-అమెరికా తరలింపు
Shah Rukh Khan Injured షారుఖ్ కు ప్రమాదం-అమెరికా తరలింపు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారనే వార్త ఆయన అభిమానులను ఆందోళనలో ముంచెత్తింది. షారుఖ్ నటిస్తున్న కింగ్ సినిమా సెట్ లో షారుఖ్ కు ప్రమాదం జరిగి గాయాలు కావడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి చిత్ర బృందం చికిత్స ఇప్పించారని తెలుస్తుంది. 

మరోపక్క  కింగ్ సినిమా యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా షారుఖ్ అస్వస్థతకు గురైనట్లు గా చెబుతున్నారు.. అయితే మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో షారుఖ్ ఖాన్ ను కుటుంబ సభ్యులు అమెరికా తరలిస్తున్నట్లుగా వార్తలు రావడంతో కింగ్ ఖాన్ అభిమానులు మరింతగా టెన్షన్ పడుతున్నారు. 

ఆయనకు అంత తీవ్రమైన గాయాలయ్యాయా, లేదంటే అమెరికా ఎందుకు తీసుకునివెళ్తారనే అనుమానంలో ఆయన అభిమానులు ఉన్నారు. షారుఖ్ త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.  

Shah Rukh Khan Injured :

Shah Rukh Khan Injured During King Shoot

Tags:   SHAH RUKH KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ