అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్యెల్యేలను అదుపు చెయ్యకుండా విచ్చలవిడిగా వదిలేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కనీసం అధికారం పోయాక అయినా తమ నేతలను అదుపులో పెట్టుకోవడం లేదు. మొన్నటికి మొన్న ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి నోరు పారేసుకున్నారు. ఇక రోజా, కొడాలి నాని లాంటి వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.
రోజా తన నోటి వల్లే మరోసారి ఎమ్యెల్యే అవ్వలేకపోయింది. నోరు ఉంది కదా అని రోజా ఎవ్వరిని లెక్క చెయ్యకుండా ఆడవాళ్ళని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు తనని నగరి ఎమ్యెల్యే.. రెండు వేలకు సినిమాల్లో వేషాలేసుకునే స్థాయి నుంచి రెండు వేల కోట్లు ఎలా సంపాదించావో అంటూ తన కేరెక్టర్ గురించి మాట్లాడారు అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఆశ్చర్యకర విషయమంటున్నారు టీడీపీ కార్యకర్తలు.
నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయే రోజా ఇపుడు తనని తిట్టారంటూ నగరి ఎమ్యెల్యేపై కంప్లీట్ చెయ్యడం హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. రోజా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటూ అక్షరాలా బ్లూ మీడియానే రోజా కి సలహా ఇస్తుంది. అంతేకాదు జగన్ గారు మీ నేతలను కాస్త అదుపులో పెట్టుకోమంటూ బ్లూ మీడియా జగన్ ని హెచ్చరిస్తుంది.