పవన్ ఫ్యాన్స్ మనసులో ఏముందో తెలియదు కానీ.. కామన్ ఆడియన్స్ మనసులో పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న హరి హర వీరమల్లు కన్నా ఎక్కువగా OG పైనే క్యూరియాసిటీ చూపిస్తున్నారు. హరి హర వీరమల్లు ఈనెల 24 న విడుదల కాబోతుంటే.. దానిపైన ఎవరూ అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం షాకింగ్ విషయమే.
రెండేళ్ల తర్వాత పవన్ స్క్రీన్ పై కనిపిస్తున్నారు అనే ఆత్రుత తప్ప వీరమల్లు పై క్రేజ్ లేదు అనేది చాలామంది వాదన. కారణాలు చాలానే ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ హరి హర వీరమల్లు పదే పదే వాయిదాపడుతూ.. చిరాకు తెప్పించడం, ఆ తర్వాత క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం, వీరమల్లు కన్నా OG లో పవన్ లుక్స్, మాస్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కనిపించడమే.
అటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా హరి హర వీరమల్లు కన్నా ఎక్కువగా OG కోసం ఎగబడడం నిజంగా వీరమల్లుకు షాకిచ్చే విషయమే. పాన్ ఇండియా మూవీ అంటున్నారు కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ వీరమల్లు మేకర్స్ చెయ్యకపోవడం, ప్రేక్షకుల్లో వీరమల్లు పై ఉన్న ఒపీనియన్ చూసాక బయ్యర్లు కూడా వీరమల్లు విషయంలో ఆలోచనలో ఉన్నారనేది పవన్ ఫ్యాన్స్ ను ఆందోళ రేకెత్తిస్తున్న అంశం.