స్విమ్ సూట్‌లో క్యూట్ బ్యూటీ

Wed 16th Jul 2025 07:19 PM
tridha choudhury  స్విమ్ సూట్‌లో క్యూట్ బ్యూటీ
Tridha Choudhury స్విమ్ సూట్‌లో క్యూట్ బ్యూటీ

నేటిత‌రం హీరోల స‌ర‌స‌న న‌టించిన త్రిథా చౌద‌రి, ఇటీవ‌ల వేడెక్కించే వెబ్ సిరీస్‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బాలీవుడ్ లో `షంషేరా` లాంటి భారీ చిత్రంలోను త్రిథా న‌టించింది. కానీ ఈ భామ‌కు ఆశించిన స్థాయిలో అవ‌కాశం ద‌క్క‌డం లేదు. ఈ సంవ‌త్స‌రం మ‌రోసారి ప్ర‌యోగాలకు సిద్ధ‌మ‌వుతోంది.

త్రిథ ప్ర‌స్తుతం వెకేష‌న్ మోడ్ లో ఉంది. స్విమ్మింగ్ పూల్ లో స్వేచ్ఛ‌గా చేప పిల్ల‌లా ఈత‌ను ఆస్వాధించిన త్రిథ అల‌సిపోయిన త‌ర్వాత‌ కాసేపు రిలాక్స్ డ్ గా అలా పూల్ సైడ్ క‌నిపించింది. త్రిథా త‌న‌ చేతిని నేల‌పై ఆన్చి దానిపై త‌న త‌ల‌ను ఉంచి రిలాక్స్ డ్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాప్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.

త్రిథా నిజానికి బ్లూ వాట‌ర్స్ లో అంద‌మైన మ‌త్స్య‌క‌న్య‌లా క‌నిపిస్తోంది. క్యూట్ గా త‌న‌దైన అందంతో హృద‌యాల‌ను దోచేస్తోంది. ప్ర‌స్తుత కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... తెలుగులో ఆశించిన స‌క్సెస్ ద‌క్క‌క‌పోవ‌డంతో ఇటీవ‌ల అంత‌గా ఆఫ‌ర్లు లేవు. అటు కోలీవుడ్ లోను త్రిథ‌ కొన్ని సినిమాల్లో న‌టించింది. కానీ బ్రేక్ రాలేదు. త‌దుప‌రి హిందీలో పెద్ద అవ‌కాశాల కోసం వేచి చూస్తోంద‌ని స‌మాచారం.

Tridha Choudhury:

Tridha Choudhury

Tags:   TRIDHA CHOUDHURY