పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ మాస్ యాక్షన్ చిత్రం OG పూర్తవడమే కాదు దర్శకుడు సుజిత్ చకచకా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చుట్టేస్తున్నారు. సెప్టెంబర్ 25 టార్గెట్ గా రాబోతున్న OG పై ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే OG నుంచి టీజర్ పవన్ కళ్యాణ్ కేరెక్టర్ పై హైప్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు OG పై మరింత క్రేజ్ పెంచేందుకు స్పెషల్ గ్లింప్స్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. OG స్పెషల్ గింప్స్ ను ఆగష్టు 15 న వదిలి అప్పటినుంచి పాన్ ఇండియా మార్కెట్ కి రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ మొదలు పెట్టేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్ వినబడుతుంది.
ఈ చిత్రంలో విలన్ గా ఇమ్రాన్ హష్మీ కనిపిస్తుండగా తమిళం నుంచి అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి లు నటిస్తున్నారు. ప్రియాంక మోహనన్ హీరయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అయ్యే కంటెంట్ తోనే సుజిత్ OG తో రాబోతున్నారు.