అరవింద సమేత తర్వాత అనూహ్యంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో సెట్ పైకి వెళ్ళబోతుంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చెయ్యాల్సిన చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు. నాగవంశీ నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అంటూ మూవీ అప్ డేట్ నుంచే విపరీతమైన అంచనాలు మొదలు కాగా.. ఈ చిత్రం మైథలాజికల్ డ్రామాగా ఉండబోతుంది.
నాగవంశీ వార్ 2 ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో పై క్రేజీ క్రేజీ అప్ డేట్స్ వదిలారు. ఎన్టీఆర్-తివిక్రమ్ మూవీ కాంబో అనౌన్సమెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేసాం, త్రివిక్రమ్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను రాముడిగా, కృష్ణుడిగా చూసాం, ఇప్పుడు తారక్ అన్నను నేను అలా చూపించబోతున్నాను.
రామాయణ గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది. అంతకు మించి త్రివిక్రమ్-ఎన్టీఆర్ మూవీ గురించి మట్లాడుకునేలా అనౌన్సమెంట్ చెయ్యడానికే మా మూవీ ని ఆపాము, వచ్చే ఏడాది మిడిల్ నుంచి ఎన్టీఆర్-త్రివిక్రం మూవీ స్టార్ట్ అవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఆగష్టు నంచి వెంకి, త్రివిక్రమ్ మూవీ మొదలవుతుంది. అది అవ్వగానే త్రివిక్రమ్ తారక్ అన్న మూవీపైకి వెళతారంటూ నాగవంశీ ఎన్టీఆర్ తో చెయ్యబోయే మూవీ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.