ప్రభాస్ `స్పిరిట్` నుంచి దీపిక పదుకొనేను దర్శకుడు సందీప్ వంగా తొలగించిన తర్వాత ఎనిమిది గంటల పని నిబంధన గురించి చాలా చర్చ సాగుతోంది. కొందరు దీపికను సమర్థిస్తుంటే, మరికొందరు సందీప్ వంగాను సమర్థిస్తున్నారు.
తాజాగా దర్శకుడు మోహిత్ సూరి తన అభిప్రాయం చెప్పారు. `` ప్రతి ఒక్కరికీ పని చేయాలా వద్దా నిర్ణయించుకునే హక్కు ఉంది. అది మీరు చేసే పని విలువ, బడ్జెట్ లను బట్టి ఉంటుంది. ఏ దర్శకుడూ ఎవరినీ అవసరం కంటే ఎక్కువ పని చేయాలని ఒత్తిడి పెంచుతారని నేను అనుకోను. ఎవరూ అనవసరంగా ఒకరిని హింసించేంత సాడిస్ట్ కాదు. కొన్నిసార్లు, మీరు బడ్జెట్ కారకంతో ఆర్టిస్టును లాక్ చేస్తారు. దాని కారణంగా ఆర్టిస్టులు రోజుకు ఎన్ని గంటలు షూట్ చేస్తారనే దానితో సహా ప్రతిదానిపైనా ప్రభావం చూపుతుంది`` అని అన్నారు. సంతకం చేసే ముందు ప్రాజెక్ట్ పరిమితులను అర్థం చేసుకోవడం అవసరమని అన్నారు.
ఏదైనా సినిమాలో భాగం కావాలా వద్దా అనే ఎంపిక ఆర్టిస్టుకు ఉంటుంది. కానీ ఎవరైనా వచ్చి సంతకం చేసిన తర్వాత నిబంధనలను నిర్దేశించడం మొదలు పెడితే అది అన్యాయంగా భావిస్తున్నాను. ప్రాజెక్ట్ ఏమిటో తెలిసి కూడా అడ్డంకులు సృష్టించుకోవడమే ఇది! అని అన్నారు. హారర్ సినిమాల స్పెషలిస్ట్ మోహిత్ సూరి తన తదుపరి రొమాంటిక్ డ్రామా సైయారా విడుదల ప్రచారంలో బిజీగా ఉన్నారు.