1600 కోట్లతో హిందీ రామాయణ ను నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు అంటేనే అమ్మో అన్నారు సినీ జనాలు, కానీ ఇప్పుడు అది 1600 కాదు 4000 కోట్లు అంటే నోరెళ్లబెట్టడం కాదు నోట మాటపడిపోతుంది. హిందీ రామాయణ బడ్జెట్ 4000 కోట్లు. ఇదేదో రూమర్ న్యూస్ కాదు, స్వయానా రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు.
నమిత్ మల్హోత్రా బడ్జెట్ స్టేట్‌మెంట్ తో ఒక్కసారిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చెయ్యని లెక్కలు, హాలీవుడ్ లో వినే లెక్కలు ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలోనే జరుగుతుంది అంటే నోట మాట పడిపోక ఏం చేస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేస్తుంది.
హిందీలో రెండు భాగాలుగా రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత గా, యష్ రావణ్ గా తెరకెక్కుతున్న రామాయణ ఒక్కో భాగానికి 2 వేల కోట్లు ఖర్చు అవుతుందట. ఇప్పటికే రామాయణ గ్లింప్స్ అంచనాలకు మించి సక్సెస్ అవడంతో సినిమా కి ఈ బడ్జెట్ ఏమంత ఎక్కువ కాదు అనే మాట వినబడుతున్నాయి ఎక్కడో ఏదో మూలన రామాయణ బడ్జెట్ పై అందరిలో విపరీతమైన సంభ్రమాశ్చర్యాలు నడుస్తున్నాయి.