Advertisementt

హీరో త‌న‌ ముఖంపై ఉమ్మేసినా కానీ..

Mon 14th Jul 2025 12:41 PM
kota srinivasarao  హీరో త‌న‌ ముఖంపై ఉమ్మేసినా కానీ..
Kota Srinivasarao హీరో త‌న‌ ముఖంపై ఉమ్మేసినా కానీ..
Advertisement
Ads by CJ

కోట శ్రీ‌నివాస‌రావు ఇక లేరు అనేది అభిమానులు జీర్ణించుకోలేని నిజం. ఆయ‌న న‌ట‌జీవితం అనుభ‌వాల స‌మాహారం.

ఓసారి కోట శ్రీనివాస‌రావుపై బాల‌య్య కాండ్రించి ముఖంపైనే ఉమ్మేసారుట‌. ఈ ఘ‌ట‌న రాజ‌మండ్రిలో జ‌రిగింది. బాల‌య్య ఏదో సినిమా ప‌నిమీద వెళ్లారుట‌. అదే స‌మ‌యంలో కోట కూడా జంధ్యాల సినిమా కోసం అక్క‌డే ఉన్నారుట‌. 

పోద్దుటే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ప‌క్క‌కు త‌ప్పుకోమ‌ని సైగ‌లు చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఇటువైపు బాల‌య్య బాబు వ‌స్తున్నారు. నేను గౌర‌వంగా న‌మ‌స్కారం బాబు అన్నాను. అంతే వెంట‌నే ఆయ‌న కాండ్రించి ముఖం మీద‌నే ఉమ్మాడు. ఏం చేస్తాం... ఏమీ చేయ‌లేం! అని అక్క‌డ నుంచి వ‌చ్చేసాను... అని బేల‌గా చెప్పారు.

అయితే బాల‌య్య అలా చేయ‌డానికి కార‌ణం ఉంది. ఎన్టీఆర్ మొద‌టిసారి సీఎం అయిన‌ప్పుడు `మండ‌లీశ్వ‌రుడు` అనే సినిమా చేసాను. అందులో ఎన్టీఆర్ పాత్ర పోషించాను. అది చాలా వివాదాస్ప‌ద‌మైంది. విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ అభిమానులు కూడా కొట్టారు. ఓఫ్యాన్ అయితే గుండెల‌పైకి ఎక్కి చెప్పుతో కొట్టాడు. అలాగే బాల‌య్య‌కి కోపం వ‌చ్చి ఉమ్మాడు.  ఆ వేషం వేయ‌డం నా త‌ప్పుకాదు. డైరెక్ట‌ర్ అలా చేయించాడు. అలాగని నేను బాధ‌ప‌డ‌లేదు. ఇది వృత్తి. ఇక్క‌డ అలాగే ఉండాలి అని కోట తెలిపారు. 

Kota Srinivasarao:

NTR

Tags:   KOTA SRINIVASARAO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ