చాలామంది సినీ తారలు తమకొచ్చిన ఫేమ్ తో బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ చేతినిండా సంపాదించడం కొత్తగా కాదు చాలా కాలంగా జరుగుతున్న విషయమే. టాప్ హీరోలు, హీరోయిన్స్, యాంకర్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈబెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిలో ఉన్నారు.
బెట్టింగ్ యాప్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసుల ఆధారంగా ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. నటులు విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, రానా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్‌రాజ్, అనన్య నాగళ్ల సహా మొత్తం 29 మందిపై కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఈడీ.. వారందరి నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనుంది.
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కేసులో పలువురిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. అంతేకాకుండా యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన మొత్తాన్ని ఐటీ రిటర్న్‌లలో లెక్కలు చూపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మనీ లాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. చాలా చోట్ల ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు తీసుకుంటున్న వ్యవహారాలు కోకొల్లలు. అందుకే ఈ విషయాన్ని ఈడీ సీరియస్ గా తీసుకుంది.