విజయ్ దేవరకొండ కు టైమ్ కలిసి రావడం లేదు. వరసగా నిరాశ పరిచే సినిమాలు రావడంతో ఎంత ఫాస్ట్ గా ఎదిగాడో అంతే స్పీడుగా దిగిపోయాడు. కెరీర్ ఆరంభంలో తన ఆటిట్యూడ్ తో రౌడీ హీరో గా అభిమానుల హృదయాలను గెలిచిన విజయ్ దేవరకొండ కొన్ని విషయాల్లో సూటిగా ఉండడాన్ని అతన్ని కాంట్రవర్సీలోకి నెట్టింది.
అంతేకాదు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా సమయంలో తన పేరుకు ముందు ది అని చేర్చుకోవడం విమర్శలకు, ట్రోలింగ్ కి దారి తీసింది. తాజాగా విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ఉన్న ట్యాగ్ విషయంలో తనపై ఎంత ట్రోలింగ్ జరిగిందో ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. చాలామంది హీరోలకు చాలా ట్యాగ్స్ ఉన్నాయి. కానీ ఎవ్వరికి తగలని ఎదురు దెబ్బలు ఆ ట్యాగ్ వల్ల నాకు తగిలాయి.
నా పేరు ముందు ది ట్యాగ్ ఉండడం వలన కొంతమందికి నచ్ఛలేదు, అప్పుడే ఆ విషయాన్ని అభిమానులకు చెప్పాను. ఆ పదం జోడించడం వల్ల విపరీతమైన వ్యతిరేఖత వచ్చింది. అదే నా ఫ్యాన్స్ కు చెప్పాను, అది తొలగించాలని. లైగర్ సమయంలో రౌడీ స్టార్, సౌత్ సెన్సేషన్ అనే ట్యాగ్ లైన్స్ వచ్చేశాయి. లైగర్ సమయంలోను మేకర్స్ నా పేరుకు ముందు ట్యాగ్ లైన్ పెడతా అన్నారు, నేను చాలా రోజులు వద్దని చెప్పాను.
ప్రతి హీరోకి అంటే చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా ప్రతి ఒక్కరికి ట్యాగ్ లైన్ అనేది ఏదో ఒకటి ఉంది, కానీ ఏ హీరోకు తగలని ఎదురు దెబ్బలు ది ట్యాగ్ లైన్ వల్ల నేను తిన్నాను అంటూ విజయ్ దేవరకొండ ట్యాగ్ లైన్ పై రియాక్ట్ అయ్యాడు