జీవితం ప్రతి ఒక్కరికీ సరదా తీర్చేస్తుంది! పూరి జగన్నాథ్ డైలాగ్ ఇది. ఈ డైలాగ్ చాలామందికి నిజాన్ని భోధిస్తుంది. అద్దాల మేడల్లో, కార్పొరెట్ భవంతుల్లో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాధించే సెలబ్రిటీలకు కూడా ఇలాంటి కష్టాలుంటాయా? అని ఆశ్చర్యపోతాం.
నిజంగానే మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ కథానాయిక సుస్మితాసేన్ జీవితాన్ని పరిశీలిస్తే ప్రతి ఒక్కరికీ వాస్తవం బోధపడుతుంది. ప్రతి 8గంటలకు ఒక స్టెరాయిడ్ తీసుకుంటేనే తాను జీవించగలనని సుస్మితాసేన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2023లో భారీ గుండెపోటు నుండి బయటపడిన సుష్, 2014 నుండి అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన అడిసన్స్ వ్యాధితో జీవిస్తోంది. తన జీవితాన్ని పొడిగించడానికి ప్రతి ఎనిమిది గంటలకు హైడ్రోకార్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన శరీరంలో కార్టిసన్ అనే హార్మోన్ కారణంగా అడ్రినలిన్ గ్రంధులు పని చేయవు. అందువల్ల జీవితాంతం స్టెరాయిడ్లు వాడాల్సిన అత్యవసర పరిస్థితి సుస్మితాసేన్ కు తలెత్తింది.
అయితే జీవించడానికి తాను మందులపై ఆధారపడకూడదనే కఠిన నిర్ణయం తీసుకుని సుస్మితాసేన్ చాలా సాహసాలకు తెగించింది. వెంటనే తన ఫిట్నెస్ ట్రైనర్ కు కాల్ చేసి జిమ్నాస్టిక్స్ లో శిక్షణ ప్రారంభిస్తానని తెలిపింది. డాక్టర్లు ఎప్పటికీ యాంటి గ్రావిటీ కదలికలు కుదరదని చెప్పినా ఆ మాటలు పెడచెవిన పెట్టి మరీ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసింది. నేను ఎలా మారతానో ఏమవుతానో నాకు కూడా తెలీదు.. కానీ ప్రయత్నించానని సుష్ చెప్పింది. అంతేకాదు యాంటీ-గ్రావిటీ వ్యాయామాలను ప్రయత్నించానని చెప్పింది. ఇది ఒక రకమైన వైమానిక ఫిట్‌నెస్ శిక్షణ. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి మంచిది కాకపోవచ్చ. కానీ తన శరీరం తనకు సహకరిస్తుందని గుడ్డిగా నమ్మానని సుష్ చెప్పింది. దానికోసం డాక్టర్ల మాటను పెడచెవిన పెట్టింది. అలాగే పూర్తి స్థాయి డీటాక్స్ ప్రోగ్రామ్‌ను కూడా అనుసరించింది. యోగా, వైమానిక వ్యాయామాలు.. యాంటీ-గ్రావిటీ శిక్షణతో చాలా మార్పులు మొదలయ్యాయి. ఇవి మనుగడ కోసమే కాదు, చాలా మార్పులకు దారి తీసే ప్రక్రియ.
కానీ ఊహించని విధంగా ఒకరోజు అత్యవసర పరిస్థితి తలెత్తింది. ఊహించని విధంగా కుప్పకూలిన తర్వాత, సుస్మితను దుబాయ్ నుండి అబుదాబికి అత్యవసర వైద్య చికిత్స కోసం తరలించారు. ఆ తరవాత టర్కీ నుండి ఆమె వైద్యుడు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. అతడు హైడ్రోకార్టిసోన్ తీసుకోవడం ఆపాలని, సుష్ శరీరం మళ్ళీ సహజంగా కార్టిసాల్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించిందని చెప్పాడు. తన 35 సంవత్సరాల అనుభవంలో అడ్రినల్ విఫలమైన వ్యక్తి సహజ హార్మోన్ ఉత్పత్తిని తిరిగి పొందడం తాను ఎప్పుడూ చూడలేదని ఆ డాక్టర్ పేర్కొన్నాడు. అతను పరీక్ష ఫలితాలను మూడుసార్లు రీచెక్ చేశాడు. చివరికి దీనిని నమ్మలేకపోయాడు. పట్టుదలతో దీనిని సుష్ సాధించుకుంది. గెలుపు అంటే సుస్మితాసేన్ అని నిరూపణ అయింది.