మంచు అన్నదమ్ములిద్దరూ ఆస్తుల పంపకాల విషయంలో చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. మంచు మనోజ్ తన వాయిస్ ని అందరికి తెలిసేలా వినిపించగా.. ఈ మొత్తం వ్యవహారంలో మంచు విష్ణు అన్ని సైలెంట్ గా చేశారనే టాక్ ఉంది. ఇక మంచు మనోజ్ నాకు ఆస్తి ముఖ్యం కాదు MBU విద్యాసంస్థల్లో మోసం జరుగుతుంది అంటూ మంచు విష్ణు చేసిన కన్నప్ప పై కూడా ఇష్టం వచ్చిన రీతిలో కామెంట్స్ చేసారు.
అయితే మంచు మనోజ్-మంచు విష్ణు నటనకు బిగ్ బ్రేకిచ్చాక చాలా ఏళ్ల తర్వాత నటులుగా మళ్లీ లక్కు ను వెతుక్కున్నారు. మంచు మనోజ్ భైరవం, మిరాయ్ లాంటి చిత్రాలు ఒప్పుకుంటే మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని హీరోగానే కాదు కన్నప్ప కు కర్త-కర్మ-క్రియ ఇలా అన్ని తానై వ్యవహరించారు. విచిత్రంగా మంచు మనోజ్-మంచు విష్ణు నటించిన రెండు చిత్రాలు భైరవం-కన్నప్ప ఒకేసారి అంటే కేవలం ఒక్క నెల గ్యాప్ లో థియేటర్స్ లో విడుదలయ్యాయి.
ముందుగా భైరవం చిత్రాన్ని అన్న కన్నప్ప కు పోటీగా విడుదల చేస్తాను, ప్రొఫెషనల్ గానే తేల్చుకుందామని మంచు మనోజ్ ఛాలెంజ్ చేసినా కొన్ని కారణాల వలన అది జరగలేదు. ఇక మంచు మనోజ్ భైరవం మే 30 న విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అందులో మంచు మనోజ్ పాత్ర బాగా ఎలివేట్ అవడము అది ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యింది.
ఇక జూన్ 27 న మంచు విష్ణు కన్నప్పను దించారు. దీనికి కూడా క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాకే వచ్చింది. కన్నప్ప లోను మంచు విష్ణు యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మంచు విష్ణు కెరీర్ బెస్ట్ అంటే అర్ధం చేసుకోవచ్చు. అటు మంచు మనోజ్, ఇటు విష్ణు ఒకేసారి నటులుగా సక్సెస్ అయ్యారు. ఇందులో గెలుపెవరిది అనడం కన్నా.. ఇద్దరూ గెలిచారనే చెప్పాలి.