రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ రేజింగ్ లో ఉన్న హీరోయిన్. పాన్ ఇండియా మార్కెట్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కూడా రష్మిక నే. తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాలతో రష్మిక చాలా బిజీ. ఈమధ్యన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కూడా సై అంటుంది. అయితే రష్మిక కి స్క్రిప్ట్ ఎంత బాగానచ్చినా.. అందులో ఉండకూడనివి ఉంటే (స్మోకింగ్ సీన్స్) లాంటివి ఉంటే మాత్రం తనకు నచ్చిన హీరో అయినా సినిమా వదిలేస్తుందట.
నాకు స్మోకింగ్ అంటే అస్సలు నచ్చదు, అందుకే నేను సినిమాల్లో అలాంటి సీన్స్ ఉన్న కేరెక్టర్స్ ని ఒప్పుకోను, స్క్రిప్ట్ వినే ముందు నేను పెట్టే కండిషన్స్ లో అదీ ఒకటి, అలాంటి పాత్రల వలన ఆడియన్స్ ఇన్ఫ్లూయన్స్ అవుతారని నమ్ముతాను, అవసరమైతే ఆ సినిమా వదులుకుంటాను కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సినిమా మాత్రం చెయ్యను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
ఇక సినిమాలపై ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ పై రష్మిక మాట్లాడుతూ.. ఒక సినిమా చూసి మీ అభిప్రాయాన్ని దానిపై రుద్దకండి, సందీప్ వంగ చేసిన యానిమల్ ప్రాజెక్ట్ కొంతమందికి నచ్చింది, మరికొంతమందికి నచ్చలేదు. ఆ చిత్రంలో మనిషిలోని మరోకోణాన్ని దర్శకుడు చూపించాడు. అది తప్పంటే ఎలా అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.