ఒక్కప్పుడు పూజ హెగ్డే మూడు భాషల్లో సినిమాలు చేస్తూ, నలుగురైదుగురు హీరోలతో ఒకేసారి షూటింగ్స్ చేస్తూ చాలా బిజీగా కనిపించేది. దాదాపుగా నాలుగుమూడు షిఫ్ట్ ల్లో పనిచేసేది. ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫ్లైట్ దిగడం అన్నట్టుగా వర్క్ చేసిన పూజ హెగ్డే ప్రస్తుతం తమిళ సినిమాలు చేసుకుంటుంది.
తాజాగా పూజ హెగ్డే మాదిరి ఇంకో హీరోయిన్ టాలీవుడ్ లో తయారైంది. ఆమె ఎవరో కాదు భాగశ్రీ బొర్సే. గతంలో ఇలానే శ్రీలీల వరసగా యంగ్ హీరోల సినిమాలు ఒప్పుకుని రెండుమూడు షిఫ్ట్ ల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఇప్పుడు ఆ అదృష్టం భాగశ్రీ బొర్సే కి దక్కింది. ప్రస్తుతము తెలుగులో వరస ఆఫర్స్ తో అమ్మడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
రీసెంట్ గానే భాగశ్రీ బొర్సే కి అఖిల్ లెనిన్ అఫర్ దక్కింది. శ్రీలీల తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి భాగశ్రీ బొర్సే వచ్చింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో కింగ్ డమ్ షూటింగ్ ఫినిష్ చెయ్యగా ఇప్పుడు ఆమె రామ్ తో ఆంధ్ర తాలూకా కింగ్, కాంత లాంటి చిత్ర షూటింగ్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు లెనిన్ అఫర్ రావడంతో భాగశ్రీ బొర్సే ఉదయం ఓ షూటింగ్, సాయంత్రం మరో షూటింగ్ అన్నట్టుగా పరుగులు పెడుతుందట.
భాగశ్రీ బొర్సే ఆ సెట్ నుంచి ఈ సెట్ కి, ఈ సెట్ నుంచి ఆ సెట్ కి వెళుతూ బిజీగా గడపడం చూసినవారు అప్పట్లో పూజ హెగ్డే ఇలానే చేసింది, ఇప్పుడు ఆ లక్కు భాగశ్రీ బొర్సే కి దొరికింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.