Advertisementt

ఫిట్ స‌మంత వ‌ర్సెస్ బొద్దు కీర్తి సురేష్

Mon 30th Jun 2025 09:29 AM
samantha  ఫిట్ స‌మంత వ‌ర్సెస్ బొద్దు కీర్తి సురేష్
Samantha vs Keerthy Suresh ఫిట్ స‌మంత వ‌ర్సెస్ బొద్దు కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

వైర‌ల్ ఫీవ‌ర్లు వైర‌ల్ అవుతున్న‌ రోజులివి. కానీ ఇక్క‌డ సామ్ ఫిట్ నెస్ జ్వ‌రాల్ని వైర‌ల్ చేస్తోంది. సమంత చాలా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొని, మ‌యోసైటిస్ లాంటి ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త‌ను ఢీకొని మ‌రీ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నేటిత‌రానికి సామ్ ఫిట్నెస్ లో ఒక దిక్సూచి.

నిరంత‌రం జిమ్ యోగాతో దీనిని సాధించింది. అయితే స‌మంత‌ను చూసి త‌న ఫ్రెండు కీర్తి కూడా నేర్చుకోవాల‌ని సూచిస్తున్నారు అభిమానులు. పెళ్లికి మునుప‌టి రూపంతో పోలిస్తే, ఇప్పుడు కీర్తి సురేష్ రూపం చూసిన వారు షాక‌వుతున్నారు. కీర్తి సురేష్ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో స‌న్న‌జాజి తీగ‌లా ఉండేది ఒక‌ప్పుడు. కానీ ఇప్పుడు బొద్దుగా క‌నిపించి షాకిచ్చింది. కీర్తియేనా ఇలా మారిపోయింది! అంటూ అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అయితే త‌న బెస్ట్ ఫ్రెండ్ కీర్తిలో మార్పు కోసం స‌మంత ఎలాంటి సూచ‌న‌లిస్తుందో చూడాలి. సామ్ ఓవైపు మ‌యోసైటిస్ కి వైద్య‌చికిత్స పొందుతూనే జిమ్ యోగా సెష‌న్స్ లో చాలా డెడికేటెడ్ గా శ్ర‌మిస్తోంది. చివ‌రికి ప్రాణాంత‌క వ్యాధిని కూడా జ‌యించి ఫిట్ గా మారింది. కీర్తి కూడా ఇప్పుడు త‌న‌ను స్ఫూర్తిగా తీసుకోవాల‌ని అభిమానులు సూచిస్తున్నారు. వృత్తిప‌రంగా చూస్తే కీర్తి న‌టించిన ఉప్పుక‌ప్పురంబు త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. అలాగే `శుభం` నిర్మాత‌గా స‌మంత సక్సెస్ సాధించి, త‌దుప‌రి వెంచ‌ర్ కోసం ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం. స‌మంత త‌దుప‌రి రాజ్ అండ్ డీకే `ర‌క్త్ బ్ర‌హ్మాండ్` సిరీస్ లోను న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Samantha vs Keerthy Suresh :

Samantha Ruth Prabhu and Keerthy Suresh surprise lunch pic

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ