Advertisementt

బిగ్ బాస్ 9 పెద్ద షాకే ఇస్తున్నారుగా

Sun 29th Jun 2025 05:30 PM
bigg boss  బిగ్ బాస్ 9 పెద్ద షాకే ఇస్తున్నారుగా
Bigg Boss 9 is giving a big shock బిగ్ బాస్ 9 పెద్ద షాకే ఇస్తున్నారుగా
Advertisement
Ads by CJ

గతంలో బిగ్ బాస్ కి కామన్‌మెన్‌ గా చాలామంది కాదు గాని... కొద్దిమంది ఎంట్రీ ఇచ్చారు. అందులో నూతన నాయుడు, రైతు బిడ్డ పేరుతొ పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ అలాగే టీవీ సీరియల్ నటులకన్నా ఎక్కువగా పెరఫార్మెన్స్ తో ఫేమస్ అయ్యారు. 

బిగ్ బాస్ కి వెళ్లి ఫేమస్ అయ్యి, సినిమా అవకాశాలు పట్టేయ్యాలనే కల సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ మాత్రమే కాదు కామన్‌మెన్‌ కి కూడా ఉంటుంది. ఇప్పుడు సీజన్ 9 కోసం అలాంటి కామన్‌మెన్‌కు బిగ్‌బాస్ గేట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాల్ ఫర్ ఎంట్రీస్ అనే పేరుతో స్టార్ మా ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసింది.

ఇప్పటి వరకు మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ప్రేమించారు. బిగ్ బాస్ ని ఇంత ప్రేమించిన మీకు రిటర్న్ గిఫ్ట్‌గా ఏం ఇవ్వాలి, మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే మీకు అసలైన రిటర్న్ గిఫ్ట్. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి సెలబ్రెటీలకే కాదు. మీకూ అవకాశం ఇస్తున్నాం అంటూ ప్రోమోలో నాగార్జున పంచ్ డైలాగ్ పేల్చారు. 

బిగ్‌బాస్ సీజన్ 9లో పార్టిసిపేట్ చేయాలంటే www.bb9.jiostar.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి.. బిగ్‌బాస్ 9లో పార్టిసిపేట్ చేయడానికి రీజన్ చెబుతూ వీడియో అప్లోడ్ చేయొచ్చని స్టార్‌ మా తెలిపింది. సో బిగ్ బాస్ 9 కి కామన్‌మెన్‌ గా ఎవరు వస్తారో చూడాలి. 

Bigg Boss 9 is giving a big shock:

 Bigg Boss telugu 9 Common man entry 

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ