Advertisementt

ధనుష్ అయినా పట్టించుకోలేదు

Sat 28th Jun 2025 03:39 PM
kuberaa  ధనుష్ అయినా పట్టించుకోలేదు
Kuberaa Tamil Box Office ధనుష్ అయినా పట్టించుకోలేదు
Advertisement
Ads by CJ

సినిమా హిట్ అయితే అందులోను తమ భాష హీరో అయితే ప్రేక్షకాధారణ మాములుగా ఉండదు. చిన్నా చితక హీరోలనైతే పట్టించుకోరేమో కానీ.. స్టార్ హీరోల సినిమాలను అలాగే హిట్ మూవీస్ ని ఎవ్వరూ వదులుకోరు. కానీ తమిళ హీరో ధనుష్ సినిమాని, హిట్ అయిన కుబేర చిత్రాన్ని తమిళ తంబీలు పట్టించుకోకపోవడమే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 

పర భాషా దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేసినా ఆదరిస్తారు. కానీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన కుబేర కు హిట్ టాక్ పడినా తమిళ ఆడియన్స్ పట్టించుకోకపోవడం మాత్రం నిజంగా షాకింగ్ విషయమే. నాగార్జున కు కూడా ధనుష్ తో ఈక్వల్ రోల్ ఇవ్వడం వలనే ఇలా జరిగింది అని కొంతమంది, శేఖర్ కమ్ముల డైరెక్షన్ తమిళ తంబిలకు పరిచయం లేకపోవడమే కారణమంటూ కొందరు మాట్లాడుకున్నారు. 

ఏది ఏమైనా ధనుష్ తమవాడు అయినా చూడలేదు తమిళ వాళ్ళు, తెలుగు ప్రేక్షకులు కుబేర ని బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. కానీ స్టార్ హీరో తమవాడే అయినా ధనుష్ కుబేర ను కోలీవుడ్ ఆడియన్స్ ఆదరించలేదు. ఇక్కడ 100 కోట్లు మార్క్ టచ్ చేస్తే తమిళనాట 20 కోట్లు కూడా కుబేర సంపాదించలేకపోయింది. మరి ధనుష్ దేవా పాత్ర తమిళ తంబీలకు కనెక్ట్ కాలేదా అనే విషయంలో ధనుష్ ఫ్యాన్స్ తర్జన భర్జన పడడం విశేషం. 

Kuberaa Tamil Box Office:

Kuberaa Box Office collections

Tags:   KUBERAA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ