Advertisementt

కన్నప్ప కు అదే ప్లస్ అయ్యింది

Fri 27th Jun 2025 01:43 PM
kannappa  కన్నప్ప కు అదే ప్లస్ అయ్యింది
Kannappa public talk కన్నప్ప కు అదే ప్లస్ అయ్యింది
Advertisement
Ads by CJ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు నేడు జూన్ 27 న థియేటర్స్ లో విడుదలైంది. పలుమార్లు విడుదల వాయిదా వేసుకుంటూ థియేటర్స్ లోకి వచ్చిన కన్నప్ప చిత్రానికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మొదటినుంచి మంచు ఫ్యామిలీ చిత్రంగా ప్రొజెక్ట్ అయినా.. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలకంగా కనిపించడంతో సినిమాపై అన్ని భాషల ఆడియన్స్ లో ఆసక్తి తొణికిసలాడింది. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్ప ను భుజాన మోశారు. కన్నప్ప ను వీలైనంతగా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. 

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప సినిమాని వీక్షించిన వారంతా మంచు విష్ణు కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చారనే మాట మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ సీన్ దగ్గరనుంచి చివరి 40 నిముషాలు సినిమాకు ప్లస్ అయ్యింది, ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా.. సెకండ్ హాఫ్ కన్నప్ప కు కీలకం గా మారింది అంటూ స్పందిస్తున్నారు.  

క్లైమాక్స్‌లో శివుడిపై అభిమానం ఉప్పొంగేలా చేసిన సన్నివేశాలు ప్రేక్షకుల గుండెలను తాకాయి. ఇంటర్వెల్ సీన్ ఎక్సలెంట్, ప్రభాస్ రుద్రుడిగా ఇచ్చిన ఎంట్రీతో కన్నప్ప ముఖ చిత్రమే మారిపోయింది. ముఖ్యంగా విష్ణు మంచు మరియు ప్రభాస్ మధ్య ఎమోషనల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. విష్ణు మంచు కన్నప్ప పాత్రలో జీవించారు, మోహన్ లాల్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది, ప్రభాస్ 40 నిమిషాల స్క్రీన్ టైమ్‌లో తన శక్తివంతమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు అదే సినిమాకి అతి పెద్ద ప్లస్ అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. 

అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ తమ పాత్రల్లో అద్భుతమైన నటన చూపించారు, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌లో చిత్రీకరించిన గ్రాండ్ విజువల్స్‌ కన్నప్పకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటూ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 

Kannappa public talk :

Kannappa twitter talk 

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ