Advertisementt

కన్నప్ప కౌంట్ డౌన్ స్టార్ట్

Thu 26th Jun 2025 10:16 AM
kannappa  కన్నప్ప కౌంట్ డౌన్ స్టార్ట్
Kannappa countdown starts కన్నప్ప కౌంట్ డౌన్ స్టార్ట్
Advertisement
Ads by CJ

మంచు వారి ఫ్యామిలీ సినిమా కన్నప్ప విడుదలకు సమయం ఆసన్నమైంది. ఎన్నోసార్లు విడుదల వాయిదా పడిన కన్నప్ప ఫైనల్ గా రేపు జూన్ 27 న పాన్ ఇండియా ఫిలిం గా రిలీజ్ కి రెడీ అయ్యింది. మంచు ఫ్యామిలిలో మంచు మనోజ్, మంచు లక్ష్మి తప్ప మోహన్ బాబు దగ్గర నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త వరకు అందరూ నటించారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్నప్ప చిత్రం పై మంచి హైప్ ఉంది. 

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించడం కన్నప్ప కు ప్లస్ అయ్యింది. దానితో కన్నప్ప ఓపెనింగ్స్ పై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. ప్రాణం పెట్టి కన్నప్పను తెరకెక్కించాం, ఆస్తులు తాకట్టు పెట్టి కన్నప్ప ని నిర్మించమంటూ మంచు విష్ణు పలు సందర్భంలో చెప్పారు. 

ఇక కన్నప్ప కు కుబేర ఎఫెక్ట్ అవుతుందేమో అనుకున్నారు, కానీ కుబేర కు కన్నప్ప ఎఫెక్ట్ అవుతుంది అంటూ మాట్లాడుకోవడమే సినిమాపై ఉన్న క్రేజ్ ని తెలియజేస్తుంది. మరి కన్నప్ప మంచు ఫ్యామిలీ ని ఏ తీరానికి చేరుస్తుందో అనేది మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.  

Kannappa countdown starts:

Kannappa releasing tomorrow

Tags:   KANNAPPA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ