Advertisementt

ఈ న‌టితో హార్థిక్ సీక్రెట్ డేట్

Wed 25th Jun 2025 07:57 PM
esha gupta  ఈ న‌టితో హార్థిక్ సీక్రెట్ డేట్
Esha Gupta secret date with hardik ఈ న‌టితో హార్థిక్ సీక్రెట్ డేట్
Advertisement
Ads by CJ

టీమిండియా క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా ఇటీవ‌లే భార్య‌ న‌టాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అన్యోన్య దంప‌తులు విడిపోవ‌డంపై అభిమానులు క‌ల‌త‌కు గుర‌య్యారు. అయితే హార్థిక్ ప్లేబోయ్ క్యారెక్ట‌ర్ కాపురంలో ఇబ్బందుల‌కు కార‌ణ‌మ‌ని కొన్ని క‌థ‌నాలొచ్చాయి.

హార్థిక్ భార్య‌కు విడాకులిచ్చి బ్రిటీష్ గాయ‌ని, న‌టితో సంబంధం కొన‌సాగిస్తున్నాడ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు పెళ్లికి ముందు హార్థిక్ పాండ్యా ప్రేమ‌క‌థ‌ల్లో ఒక షార్ట్ ల‌వ్ స్టోరి బ‌య‌ట‌ప‌డింది. అత‌డు ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తాతో 2 నెల‌ల పాటు స‌న్నిహితంగా ఉన్నాడు. కానీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా డేటింగ్ వర‌కూ వ్య‌వ‌హారం వెళ్ల‌లేద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో ఈషా గుప్తా వెల్ల‌డించింది. హార్థిక్ తో డేటింగ్ చేయ‌లేదు.. మా ఇద్ద‌రికీ స‌రిప‌డేంత‌ స‌మ‌యం లేక‌పోవ‌డం స‌మ‌స్య‌గా మారింద‌ని, తాము కొంత‌కాలం బాగా మాట్లాడుకునేవాళ్లం అని కూడా ఈషా గుప్తా వెల్ల‌డించింది.

కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో హార్థిక్ కి అత‌డి షార్ట్ డేటింగ్ గురించి ప్ర‌శ్న ఎదురైంది. ఈషా గుప్తాతో ఎఫైర్ మ్యాటర్ ని క‌ర‌ణ్ ప్ర‌శ్నించాడు. అయితే అప్ప‌టికే తాము విడిగా దూరంగా ఉన్నామ‌ని ఈషా గుప్తా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. రెండు నెల‌ల పాటు మాట్లాడుకున్నాం.. కానీ అది డేటింగ్ అని నేను అనుకోను! అని ఈషా గుప్తా తెలిపింది. ఇషా ప్ర‌స్తుతం స్పానిష్ యువ‌కుడితో డేటింగ్ లో బిజీగా ఉంది.

Esha Gupta secret date with hardik:

  Esha Gupta secret date  

Tags:   ESHA GUPTA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ