Advertisementt

నాగార్జున గారు బిగ్ బాస్ మానెయ్యండి..

Wed 25th Jun 2025 01:22 PM
nagarjuna  నాగార్జున గారు బిగ్ బాస్ మానెయ్యండి..
Nagarjuna, stop being a Bigg Boss-Audience request నాగార్జున గారు బిగ్ బాస్ మానెయ్యండి..
Advertisement
Ads by CJ

నాగార్జున గారు బిగ్ బాస్ మానెయ్యండి.. ఇది మనమన్నది కాదు.. ఆయన నటించిన కుబేర చిత్రం చూసాక ఆడియన్స్ అంటున్న మాట. బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జున పై సోషల్ మీడియాలో విమర్శలు ఒక ఎత్తు.. బిగ్ బాస్ కి వెళ్లి ఎలిమినేట్ అయ్యేవారు మాట్లాడేమాటలు మరో ఎత్తు అన్నట్టుగా నాగార్జున ఇమేజ్ బిగ్ బాస్ వల్ల డ్యామేజ్ అవుతుంది అనేది అభిమానుల బాధ.

సోలో హీరోగా చెయ్యకపోతేనేమి.. కుబేర చిత్రంలో కీలక పాత్రలో నాగార్జున అద్భుతంగా మెప్పించారు. అలాంటి చిత్రాల్లో కీ రోల్స్, కూలి  చిత్రంలో సూపర్ స్టార్ కి విలన్ పాత్రలు చేసుకోండి నాగార్జున గారు మీరు బిగ్ బాస్ హోస్ట్ మాత్రం చెయ్యకండి అంటూ కుబేర చిత్రం చూసొచ్చి ప్రేక్షకులు పబ్లిక్ గా నాగార్జున ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

నాగార్జున గారు మీరు విలన్ గా ఇంకా ఇంకా ట్రై చెయ్యండి మీకు లైఫ్ ఉంటుంది. సోలో సినిమాలు చెయ్యకపోయినా మేము అడగం, కానీ ఆ బిగ్ బాస్ మానెయ్యండి అంటూ అడుగుతున్నారు. మరికొద్దిరోజుల్లో మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 9 ముందు చాలామంది ఆడియన్స్ నాగార్జునను బిగ్ బాస్ మానెయ్యమని అడగడం మాత్రం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. 

Nagarjuna, stop being a Bigg Boss-Audience request:

Nagarjuna-Bigg Boss

Tags:   NAGARJUNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ