డ్రగ్స్ కేసులో పట్టుబడిన నటుడు శ్రీరామ్

గతంలో డ్రగ్స్ కేసులో చాలామంది సినీ ప్రముఖులు పట్టుబడి ప్రభుత్వ అండదండలతో క్లీన్ చిట్ తో బయటికొచ్చినవారు ఉన్నారు. చాలా సందర్భాల్లో సెలబ్రిటీస్ డ్రగ్ కేసులో అరెస్ట్ అవుతున్న సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు అలాంటి డ్రగ్ కేసులో తమిళ నటుడు శ్రీరామ్ పట్టుబడడం సంచలనం సృష్టిస్తుంది.
తిరుపతికి చెందిన శ్రీరామ్ తెలుగు కంటే తమిళ్ లో శ్రీకాంత్ గా ఎక్కువగా సినిమాలు చేశాడు.. హోమ్లీ స్టార్ పలు సినిమాల్లో నటించి పేరుతెచ్చుకున్న శ్రీరామ్ ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం అందరిని విస్మయానికి గురిచేస్తోంది, మాజీ DMK నేత నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు. డ్రగ్స్ కేసులో అరెస్టైన వారు ఇచ్చిన సమాచారంలో శ్రీరామ్ పేరు ఉండడంతో అతన్ని పోలీసులు అదుపులకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది.
శ్రీరాంని విచారిస్తున్న చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ పోలీసులు. ఇప్పటికే శ్రీరాం బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు. శ్రీరామ్ తో పాటుగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
Tamil actor Sriram arrested by Chennai police in drugs case
Tamil actor Srikanth arrested








































