Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Akkineni fans want Akhil to complete hat-trick

అక్కినేని సక్సెస్ జోష్ కి అదొక్కటే బ్యాలెన్స్

అక్కినేని హీరోలు వరసగా హిట్స్ కొట్టేస్తున్నారు. కొంతకాలంగా డిజప్పాయింట్ మోడ్ లో ఉన్న అక్కినేని హీరోలు సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ ఏడాది తండ్రి కొడుకులు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. నాగ చైతన్య ఫిబ్రవరిలోనే తండేల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకోవడమే కాదు మొదటిసారి 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టాడు. 

ఆ తర్వాత అక్కినేని మరో హీరో సుమంత్ అనగనగా అంటూ ఓటీటీ లో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కింగ్ నాగార్జున సోలో గా కాకపోయినా.. పాన్ ఇండియా ఫిలిం కుబేర తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో తెరకెక్కిన కుబేర చిత్రం గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తోనే కాదు సూపర్ హిట్ కలెక్షన్స్ తో బాక్సాఫీసు బూజు దులుపుతుంది. స్తబ్దుగా పడి ఉన్న బాక్సాఫీసుకు కుబేర బుకింగ్స్ కళ తెచ్చాయి. 

నాగార్జున ఖాతాలో కుబేర లాంటి పాన్ ఇండియా హిట్ పడడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వెళ్లినా.. మరొక్క హిట్ మాత్రమే వాళ్లకు బ్యాలెన్స్ ఉంది. అదే అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఖాతాలోకి రాబోయే లెనిన్ హిట్. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ లెనిన్ చిత్రం చేస్తున్నాడు. అఖిల్ బర్త్ డే కి వదిలిన లెనిన్ గ్లింప్స్ చూసాక అఖిల్ ఖాతాలోకి భారీ  హిట్ చేరుతుంది అని అక్కినేని కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. 

 అక్కినేని సక్సెస్ జోష్ లో అఖిల్ కూడా జాయిన్ అయితే అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. మరి లెనిన్ రిజల్ట్ ఏమిటి అనేది కాస్త వేచి చూస్తే కానీ తెలియదు. అఖిల్ కూడా బిగ్ హిట్ కొట్టాలని ఎంతగా కోరుకుంటున్నాడో అంతకుమించి అక్కినేని అభిమానులు అఖిల్ హిట్ కోసం తహతహలాడిపోతున్నారు.  

Fans are eagerly expecting Akhil to bounce back with his upcoming film Lenin

Akkineni fans want Akhil to complete hat-trick
akhil