Advertisement

లేట్ అయినా లేటెస్ట్ గా వస్తానంటున్న నిధి

హీరోయిన్ నిధి అగర్వాల్ కి ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో సినిమాలు చేసింది. కానీ అవి విడుదలయ్యేందుకు ఏళ్ళు పట్టినా ఈ భామ వెయిట్ చేసింది. పవన్ తో హర హర వీరమల్లు లో నిధి అగర్వాల్ యువరాణి గా నటించింది. 

ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో జులై 24 న విడుదల కాబోతుంది. హరి హర వీరమల్లులో సోలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విడుదల కోసం మూడేళ్ళుగా వెయిట్ చేస్తుంది. ఫైనల్ గా వీరమల్లు డేట్ లాకయ్యింది. ఆ సినిమా రిజల్ట్ పై నిధి అగర్వాల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. 

ఇదే కాదు ప్రభాస్ తో నటించిన పాన్ ఇండియా ఫిలిం రాజా సాబ్ కూడా ఈఏడాది విడుదల కాబోతుంది. డిసెంబర్ 5 న రాజా సాబ్ పాన్ ఇండియా ఫిలిం గా విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రంలో అమ్మడు గ్లామర్ షో చేయబోతుంది. కొద్దినెలల గ్యాప్ లో నిధి అగర్వాల్ బ్యాట్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఆ మరి తన సినిమాలు విడుదల లేటయినా లేటెస్ట్ గా స్టార్ హీరోలతో 2025 ఏడాదిని నిధి ముగిస్తుంది. 

హరి హర వీరమల్లు, రాజా సాబ్ ఈ రెండు సినిమాలో ఏది హిట్ అయినా నిధి అగర్వాల్ కెరీర్ ఊపందుకుంటుంది. ఇకపై సోషల్ మీడియాలోనూ ఇలాంటి నిధి అగర్వాల్ గ్లామ్ లుక్స్ కి కొదవ ఉండదు. 

Nidhi Agarwal Stuning Looks

Nidhi Agarwal latest look viral
nidhi agarwal