Advertisementt

కుబేర : ఇది శుభారంభం

Fri 20th Jun 2025 09:13 PM
kuberaa  కుబేర : ఇది శుభారంభం
Kuberaa: This is a good beginning కుబేర : ఇది శుభారంభం
Advertisement
Ads by CJ

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చింది సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని బాక్సాఫీసు మళ్ళీ చూడలేదు, మధ్యలో మళయాళం నుంచి డబ్ అయిన సినిమాలు తెలుగు బాక్సాఫీసు పై చెయ్యి సాధించినా.. అవి తెలుగులో అంత పెద్ద హిట్స్ అవ్వలేదు. ఫిబ్రవరిలో తండేల్ హిట్, మార్చ్ లో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ హిట్స్, ఏప్రిల్ లో సారంగపాణి జాతకం లాంటి చిన్న హిట్, మే లో హిట్ 3, సింగిల్ బాక్సాఫీసు దగ్గర హడావిడి చేసాయి. 

ఇక జూన్ స్టార్ట్ అవడమే థగ్ లైఫ్ లాంటి భారీ చిత్రంతో మొదలైనా.. ఆ చిత్రం బాక్సాఫీసుని, ప్రేక్షకులను అన్ని భాషల్లో డిజప్పాయింట్ చేసింది. గత ఐదు నెలలుగా స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసు కు మళ్లీ జీవం పోసింది ధనుష్-నాగ కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రం పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 

అంతేకాదు ఓపెనింగ్స్ డల్ గా ఉన్నప్పటికి.. కుబేర కొచ్చిన పాజిటివ్ వైబ్స్ తో బుకింగ్స్ జోరుగా స్టార్ట్ ఆయాయ్యి. శుక్రవారం కాస్త నెమ్మదిగా మొదలైన కుబేర బుకింగ్స్ శని, ఆదివారాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ కూడా ఫుల్ అయ్యాయంటే.. బాక్సాఫీసుకి కుబేర శుభారంభం అనేలా ఉంది. బాక్సాఫీసుకి నిజంగా కుబేర ఊరటచ్చింది. 

కుబేర కొస్తున్న పాజిటివ్ టాక్, రివ్యూస్ అన్ని సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయడమైతే గ్యారెంటీగా కనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా రోజుల తర్వాత రిలాక్స్డ్ గా థియేటర్స్ లో కూర్చుని కుబేరను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. 

Kuberaa: This is a good beginning:

Kuberaa movie ticket booking status

Tags:   KUBERAA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ