Advertisementt

టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్

Fri 20th Jun 2025 11:21 AM
nani  టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్
New combination in Tollywood టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్
Advertisement
Ads by CJ

కొన్నాళ్లగా అంటే సార్ మూవీ దగ్గర నంచి తెలుగు దర్శకుడైన వెంకీ అట్లూరి టాలీవుడ్ హీరోలను పక్కనబెట్టి ఇతర భాషల హీరోలపై ఫోకస్ పెడుతున్నారు. సార్ చిత్రాన్ని ధనుష్ తో తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఆ తర్వాత లక్కీ భాస్కర్ కోసం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ని పట్టుకున్నారు. ఆ చిత్రం 100కోట్ల క్లబ్బులోకి అలవోకగా అడుగుపెట్టింది.

ఆతర్వాత అయినా వెంకీ అట్లూరికి తెలుగు హీరో దొరుకుతాడు అనుకున్నారు. కానీ వెంకీ ట్రై చెయ్యడం లేదో, లేదంటే తెలుగు హీరోలు వెంకీని పట్టించుకోలేదో అన్నట్టుగా వెంకీ అట్లూరి కి మళ్ళీ కోలీవుడ్ హీరోతో సెట్ లోకి అడుగుపెట్టారు. సూర్య-వెంకీ అట్లూరి కాంబో రీసెంట్ గానే హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోయింది. 

సూర్య ప్రాజెక్ట్ తర్వాత వెంకీ అట్లూరి సినిమాపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వెంకీ అట్లూరి సూర్య తో సినిమా ముగించేసాక టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరో నాని తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారని టాక్. అటు నాని హిట్ 3 తర్వాత ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ప్యారడైజ్ తర్వాత వెంకీ అట్లూరి తో నాని సినిమా ఉండొచ్చని తెలుస్తుంది. 

New combination in Tollywood:

Nani-Venky Atluri combo on cards

Tags:   NANI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ