Advertisementt



పెరిగిన కుబేర సినిమా టిక్కెట్ రేట్లు

Thu 19th Jun 2025 03:04 PM
kuberaa  పెరిగిన కుబేర సినిమా టిక్కెట్ రేట్లు
Kuberaa movie ticket prices increased పెరిగిన కుబేర సినిమా టిక్కెట్ రేట్లు
Advertisement
Ads by CJ

రేపు అంటే జూన్ 20 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న కుబేర చిత్రం పై మంచి హైప్ ఉంది. కోలీవుడ్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక లాంటి క్రేజీ స్టార్స్ నటించిన కుబేర చిత్రాన్ని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. రేపు విడుదల కాబోతున్న కుబేర చిత్రానికి ఆంధ్ర లో టికెట్ రేట్లు పెరిగాయి. 

మల్టిప్లెక్స్ మరియు సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు వరకు పెంపునకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతేకాకుండా 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హయ్యర్ క్లాస్ టికెట్స్ కు మాత్రమే టికెట్ రేట్స్ పెంపు వర్తింపు. 

తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం హోంశాఖకు దరఖాస్తు చేసుకున్న కుబేర నిర్మాతలు.. అన్ని పరిశీలించి ఏపీ ప్రభుత్వం కుబేర చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. 

Kuberaa movie ticket prices increased:

Kubera Ticket Hike in AP

Tags:   KUBERAA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ