Advertisementt



డల్ గా కుబేర బుకింగ్స్

Thu 19th Jun 2025 12:53 PM
kuberaa  డల్ గా కుబేర బుకింగ్స్
Advance bookings for Kuberaa have officially opened డల్ గా కుబేర బుకింగ్స్
Advertisement
Ads by CJ

సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాల తర్వాత మళ్ళీ ఆ రేంజ్ భారీ సినిమాలు కానీ, పాన్ ఇండియా మూవీస్ కానీ గత ఐదు నెలలుగా విడుదల కాలేదు. మధ్య మధ్యలో మీడియం బడ్జెట్ సినిమాలు తప్ప బిగ్ అండ్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కాలేదు, దానితో మూవీ లవర్స్ అంతా పెద్ద సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని చూస్తుంటే.. ఈ నెలలోనే వచ్చిన కమల్ థగ్ లైఫ్ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో నిరాశపరిచింది. 

ఇక జూన్ 20న హీరో ధనుష్-నాగార్జున నటించితిన శేఖర్ కమ్ముల కుబేర పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. ధనుష్ మరియు  నాగార్జున, రష్మిక, శేఖర్ కమ్ముల కుబేర చిత్రానికి చేసిన ప్రమోషన్స్ మాత్రమే కాదు కుబేర టీజర్, ట్రైలర్ అన్ని ఆసక్తి కలిగించేవిలా ఉన్నాయి.. అయితే కుబేరపై ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉందో అనేది మాత్రం క్లారిటీ లేదు. 

కుబేర బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో లో కుబేర బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా డల్ గా ఉన్నాయి కుబేర బుకింగ్స్. స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, 1000 కోట్ల హీరోయిన్ రష్మిక ఉన్నారు. అయినా ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై ఆసక్తి లేదా, లేదంటే సినిమా విడుదలై బావుంది అని టాక్ వస్తే అప్పుడు థియేటర్స్ కి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా అనేది మాత్రం మేకర్స్ కి అర్ధం కానీ ప్రశ్న. 

మరి కుబేర ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది రేపు ఈపాటికి ఓ స్పష్టత వచ్చేస్తుంది. సినిమాకి పాజిటివ్ టాక్ పడితే ఎవరూ ప్రేక్షకులను థియేటర్స్ కి రాకుండా ఆపలేరు. చూద్దాం కుబేర రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనేది.!

Advance bookings for Kuberaa have officially opened:

Advance booking for Kuberaa

Tags:   KUBERAA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ