కుబేర కు సెన్సార్ షాక్

Kuberaa censor details shockKuberaa censor details shock

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కుబేర చిత్రంపై ఎంత హైప్ ఉందొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేసవి సెలవల తర్వాత భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జూన్ 5 న విడుదలైన కమల్ హాసన్ థగ్ లైఫ్ పై అంచనాలు పెట్టుకుంటే అది డిజప్పాయింట్ చేసింది. దానితో కుబేర వచ్చేవరకు ఆడియన్స్ లో ఆత్రుత ఎక్కువైపోయింది. 

ధనుష్-నాగార్జున-రష్మిక కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర ట్రైలర్ చిత్రం పై అంచనాలు పెంచగా.. ఇప్పుడు సెన్సార్ సభ్యులు మాత్రం కుబేర మేకర్స్ కి షాక్ ఇచ్చారు. కుబేర కు ఏకంగా 19 సెన్సార్ కట్స్ ఇవ్వడం అందరికి షాకిచ్చింది. కుబేర చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. 

మరోపక్క కుబేర చిత్రానికి మరో చిన్న సినిమా షాకిచ్చేలా ఉంది. జూన్ 20 న కుబేర చిత్రం తో పాటుగా 8 వసంతాలు చిత్రం విడుదల కాబోతుంది. చిన్న చిత్రమే అయినా 8 వసంతాల ప్రమోషన్స్, ఆ చిత్ర ట్రైలర్ చూసాక కుబేర కు పోటీ తప్పదనిపిస్తోంది. చూద్దాం కుబేర ఎలా ఉండబోతుందో అనేది.!

Kuberaa underwent 19 cuts

kuberaa