ముంబైలో ఎయిర్ పోర్ట్ లో జంటగా VD-రష్మిక

విజయ్ దేవరకొండ - రష్మిక వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నారు. ఒకరి సినిమా విడుదలకు ముందు మరొకరు సోషల్ మీడియా వేదికగా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటారు, అలాగే ఒకరి సినిమా రిలీజ్ అవుతుంది అంటే రెండు రోజుల ముందే ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లిపోవడం, లంచ్ డేట్ లో కలవడంలో చేస్తూ ఉంటారు. సికందర్ రిలీజ్ కి ముందు రష్మిక-విజయ్ దేవరకొండ ముంబైలో లంచ్ డేట్ కి వెళ్ళడమే కాదు, విజయ్ బర్త్ డే కి రష్మిక - విజయ్ సీక్రెట్ గా వెకేషన్ కి వెళ్లారు. ఇప్పుడు రష్మిక నటించిన కుబేర విడుదలకు ముందు టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు విజయ్ దేవరకొండ. కుబేర టీమ్ కి శుభాకాంక్షలు, శేఖర్ కమ్ములకు నా కెరీర్ లో ప్రత్యేక స్థానం ఉంటుంది. నాలాంటి ఎంతోమంది నటుల ఆశయాలను ఆయన నిజం చేసారు. నాకిష్టమైన నటులు నటించిన కుబేర ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు వేచి ఉన్నాను అన్నారు.
తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక ఒకే కారులో ముంబై ఎయిర్ పోర్ట్ కి రావడంతో ఫోటో గ్రాఫర్స్ తమ చేతులకు పని చెప్పారు, ఇద్దరూ జంటగా కారు నుంచి దిగి ఎయిర్ పోర్ట్ లోకి నడుచుకుంటూ వెళ్లడం హైలెట్ అయ్యింది. కుబేర విడుదలకు ముందు రిలాక్స్ అయ్యేందుకు రష్మిక విజయ్ దేవరకొండ తో కలిసి వెకేషన్ కు వెళ్ళింది అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
Rashmika Mandanna and Vijay Deverakonda were seen leaving in the same car
Vijay Deverakonda, Rashmika Leave Mumbai Airport






































