Advertisementt

ఫోటోగ్రాఫ‌ర్ల‌పై స‌మంత చిరాకు

Tue 17th Jun 2025 04:01 PM
samantha  ఫోటోగ్రాఫ‌ర్ల‌పై స‌మంత చిరాకు
Samantha snaps at paps ఫోటోగ్రాఫ‌ర్ల‌పై స‌మంత చిరాకు
Advertisement
Ads by CJ

త‌న‌ను అదే ప‌నిగా వీడియోలు, ఫోటోలు తీస్తున్న వారిపై స‌మంత రూత్ ప్ర‌భు విరుచుకుప‌డింది. స్టాప్ ఇట్ గ‌య్స్! అంటూ ఫేస్ అదోలా పెట్టింది. అస‌లు ఏమైందో ఏమో కానీ, స‌మంత కాస్త అన్ ఈజీగా క‌నిపించింది. అసౌక‌ర్యంగా ఫీలైంది. క‌ళ్లు వాచి క‌నిపిస్తున్నాయి.

 

కొంత‌కాలంగా ముంబై లో స్టే చేస్తున్న స‌మంత, అక్క‌డే బాంద్రాలో త‌న నివాసానికి స‌మీపంలోని జిమ్ కి వెళ్లి వ‌స్తోంది. అలా ఈరోజు కూడా జిమ్ లో వ‌ర్క‌వుట్లు ముగించి తిరిగి వెళుతుంటే కొంద‌రు ఫోటోలు, వీడియోలు తీస్తూ క‌నిపించారు. త‌న‌ను ఆ పొజిష‌న్ లో చూస్తూ కూడా ఫోటోలు వీడియోలు తీస్తున్న వారిపై విరుచుకుప‌డింది. మొహం చికాగ్గా పెట్టింది.

 

జిమ్ యోగా కోసం టైట్ ఫిట్ దుస్తుల‌ను ధ‌రించే స‌మంత ఈసారి కూడా ఒంటిని అతుక్కుపోయిన దుస్తుల‌నే ధ‌రించింది. సామ్ స్పెష‌ల్ లుక్కుని క్యాప్చుర్ చేసేందుకు యూత్ అదే ప‌నిగా వెంబ‌డించారు. దీంతో చికాకు ప‌డిపోయింది స‌మంత‌. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. స‌మంత ప్ర‌స్తుతం రాజ్ అండ్ డీకే ర‌క్త్ బ్ర‌హ్మాండ్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు హిందీ చిత్రాల్లో న‌టించేందుకు స‌మంత‌కు ప్ర‌పోజ‌ల్స్ వ‌చ్చాయ‌ని తెలిసింది.

Samantha snaps at paps:

  Samantha fires on Photographers  

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ