జగనే వైస్సార్సీపీ కి పెద్ద శత్రువా

జగన్ కు అండగా, దండుగా ఉండాల్సిన బ్లూ మీడియానే జగన్ ని వైసీపీ పార్టీకి పెద్ద శత్రువు అంటూ సంబోధించడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. ఎప్పుడు జగన్ ని వెనకేసుకొచ్చే బ్లూ మీడియా జగన్ తప్పులను పదే పదే ఎత్తి చూపుతుంది. అధికారంలో ఉన్నపుడు, అధికారం లేనపుడు కూడా వైసీపీ కార్యకర్తలను జగన్ విస్మరిస్తున్నారనే మాట రాగంలా పాడుతుంది బ్లూ మీడియా.
ఎక్కువగా తన చుట్టూ ఉన్న నేతలని నమ్ముకుంటున్న జగన్.. వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, అధికారం పోయాక జగన్ కి బడా వైసీపీ నేతల వలన అస్సలు ప్రయోజనం లేదు, అయినప్పటి.. జగన్ వీరినే అందలం ఎక్కిస్తున్నారని, వారినే నమ్ముతున్నారని పదే పదే మొత్తుకుంటుంది.
కూటమి ప్రభుత్వం విషయంలో లోపాలను ఎత్తి చూపే విషయంలో వైసీపీ నేతలవరూ జగన్ కు సహకరించడం లేదు, నేతలను కార్యకర్తలను కలుపుకుపోయేవరకు వైసీపీ బాగుపడదు, జగన్ అవన్నీ తెలుసుకుని మెసులుకుంటే వైసీపీ కి భవిష్యత్తు ఉంటుంది, లేదంటే వైసీపీ పతనమైపోతుంది అంటూ బ్లూ మీడియా గొంతెత్తి చాటుతుంది.
మరి జగన్ ఇప్పటికైనా మారతారని బ్లూ మీడియా ఆశిస్తుంది, నేతలకు గౌరవం ఇచ్చినా వారు కూడా పార్టీ కోసం కష్టపడాలి, కార్యకర్తల్లో జోష్ ఉంది, అది పొతే పార్టీ మనుగడకే దెబ్బ అంటుంది బ్లూ మీడియా. అది నిజమేగా జగన్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
YS Jagan Mohan Reddy
YS Jagan








































