Advertisementt

రాజా సాబ్ టీజర్: డార్క్ కామెడీ

Mon 16th Jun 2025 12:08 PM
raja saab  రాజా సాబ్ టీజర్: డార్క్ కామెడీ
Raja Saab Teaser Review రాజా సాబ్ టీజర్: డార్క్ కామెడీ
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెర పడింది. గత నాలుగు నెలలుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ టీజర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు రావడమే కానీ..మేకర్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి అభిమానులు విసిగిపోయారు, ఎట్టకేలకు రాజా సాబ్ టీజర్ వచ్చేసింది. జూన్ 6 న గ్రాండ్ ఈవెంట్ తో రాజా సాబ్ టీజర్ ని వదిలారు మేకర్స్. మారుతి ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారో.. ఇప్పటికే ఫస్ట్ లుక్, అలాగే రాజా సాబ్ గ్లింప్స్ లోనే క్లారిటీ ఇచ్చారు. 

అంతేకాకుండా రాజా సాబ్ టీజర్ ని కొంతమంది ప్రముఖులు వీక్షించి.. టీజర్ పై అంచనాలు పెరిగేలా ట్వీట్లు వెయ్యడంతో అభిమానుల్లో టీజర్ పై విపరీతమైన క్యూరియాసిటీ మొదలయ్యింది, ఇప్పుడు క్యూరియాసిటీకి తెరపడింది, రాజా సాబ్ టీజర్ వచ్చేసింది. రాజా సాబ్ టీజర్లోకి వెళితే.. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం దీన్నీ నేను మాత్రమే అనుభవిస్తాను అంటూ సంజయ్ దత్ ఎంట్రీ.. ఆతర్వాత ఆస్తి కోసం ప్రభాస్ పడే పాట్లు, హార్ కామెడీ కి లింక్ చెయ్యడమేకాదు.. హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లకు రాజా సాబ్ టీజర్ లో గ్లామర్ గా స్పేస్ ఇచ్చారు. 

హలొ హలొ బండి కొంచెం మెల్లగా అంటూ ప్రభాస్ ఇచ్చిన కూల్ ఎంట్రీ కి అభిమానులు సరదాగా విజిల్స్ వేస్తున్నారు.  అసలే మన లైఫ్ అంతంత మాత్రం అంటూ డైలాగ్ చెప్పిన ప్రభాస్ లుక్, బస్సు లో వేలాడుతూ వెళ్లే షాట్ అన్నిటిలో ప్రభాస్ లుక్స్ ఇంప్రెస్స్ చేస్తున్నాయి. ప్రభాస్ యాక్షన్, హర్రర్ కామెడీ ని ప్రభాస్ కోసమే ప్రత్యేకంగా రాసుకున్నట్టుగా ఉంది. 

హీరోయిన్స్ తో రొమాంటిక్ యాంగిల్, ప్రభాస్ కామెడీ యాంగిల్, థమన్ మ్యూజిక్, BGM, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని రాజా సాబ్ టీజర్ కి హైలెట్ గా నిలవగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా వున్నాయి.  

Raja Saab Teaser Review:

Raja Saab Teaser Released

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ