Advertisementt



పెళ్లి విడాకుల‌పై స్టార్ హీరో నిర్వేదం

Sun 15th Jun 2025 09:56 AM
salmankhan  పెళ్లి విడాకుల‌పై స్టార్ హీరో నిర్వేదం
SalmanKhan talks about relationships and divorce పెళ్లి విడాకుల‌పై స్టార్ హీరో నిర్వేదం
Advertisement
Ads by CJ

పెళ్లి - విడాకుల గురించి స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌లు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. స‌ల్మాన్ ఇటీవ‌ల ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నాడు. త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించిన తాజా క్లిప్ సంచ‌ల‌నంగా మారింది. ఇందులో బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ స‌ల్మాన్ ఖాన్(59) పెళ్లి గురించి, బ్రేక‌ప్ గురించి మాట్లాడారు.

 

అతడు వ్యాఖ్యానిస్తూ.. చిన్న చిన్న అపార్థాల‌కే భార్యాభ‌ర్త‌లు విడిపోతున్నార‌ని, ఒక‌ప్ప‌టిలా ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని క‌లిసి ఉండ‌టం లేద‌ని అన్నారు. చిన్న గొడ‌వ‌ల‌కే ఎవ‌రూ త‌గ్గ‌డం లేద‌ని అన్నారు. వివాహ వ్య‌వ‌స్థ ఇప్పుడు అంతా మారిపోయింది.. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య గౌర‌వమ‌ర్యాద‌లు లేవ‌ని అన్నారు. ఆమె విడాకులు తీసుకుని మీ స‌గం డ‌బ్బుతో వెళుతుంద‌ని కూడా స‌ల్మాన్ భాయ్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

 

మొత్తానికి 60 వ‌య‌సుకు చేరువ‌వుతున్న స‌ల్మాన్ భాయ్ భార‌తీయ వివాహ‌ వ్య‌వ‌స్థ‌ను బాగా అర్థం చేసుకున్నాడు. అర్థమైంది గ‌నుకే అత‌డు ఇంకా బ్యాచిల‌ర్ గా ఉన్నాడ‌ని యూత్ స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. స‌ల్మాన్ గ‌తంలో సోమి అలీ, ఐశ్వ‌ర్యారాయ్, క‌త్రిన కైఫ్, లులియా వాంటూర్ ల‌తో సుదీర్ఘ కాలం డేటింగులు చేసాడు. కానీ వారంతా వేరొక‌రిని పెళ్లాడి లైఫ్ లో సెటిల‌య్యారు. స‌ల్మాన్ ఇంకా బ్యాచిల‌ర్ గా మిగిలాడు. దీనికి కార‌ణం తాను చేసిన‌ త‌ప్పులేన‌ని కూడా స‌ల్మాన్ అంగీక‌రించాడు. 

SalmanKhan talks about relationships and divorce:

  SalmanKhan on relationships and divorce  

Tags:   SALMANKHAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ