Advertisementt

అల్లు అర్జున్ ని హగ్ చేసుకున్న రేవంత్ రెడ్డి

Sat 14th Jun 2025 10:46 PM
revanth reddy  అల్లు అర్జున్ ని హగ్ చేసుకున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Hugs Allu Arjun అల్లు అర్జున్ ని హగ్ చేసుకున్న రేవంత్ రెడ్డి
Advertisement
Ads by CJ

పుష్ప 2 ప్రీమియర్స్ సమయంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం హీరో అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి జైలుకి పంపి ఒక రోజు మొత్తం అల్లు అర్జున్ ని చర్లపల్లి జైలులో ఉంచడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై కక్ష గట్టి ఇలాంటి పని చేసింది అన్నారు. 

అల్లు అర్జున్ vs రేవంత్ ప్రభుత్వం అంటూ అప్పట్లో పెద్ద కథే నడిచింది. అలాంటి వీరిద్దరూ కలిసి హగ్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆ వేదిక తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల అవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. పుష్ప చిత్రానికి బెస్ట్ యాక్టర్ గా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌ను సిఎం రేవంత్ రెడ్డి అభినందించారు. స్వయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు.

ఈ అవార్డు వేడుకలో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మరీ ఆలింగనం చేసుకోవడం విశేషం. అంతేకాదు బాలయ్యతో పాటుగా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ సరదాగా ముచ్చటిస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవేడుకకి  విజయ్ దేవరకొండ, సుకుమార్, రాజమౌళి, నాగ్‌అశ్విన్ తదితరులు కూడా హాజరయ్యారు.

CM Revanth Reddy Hugs Allu Arjun :

CM Revanth Reddy Hugs Allu Arjun at TGFA Awards

Tags:   REVANTH REDDY
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ