జూన్ 27 న విడుదల కాబోతున్న కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు అండ్ టీమ్ వదిలిన కన్నప్ప ట్రైలర్ పాన్ ఇండియా ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయ్యేలా ఉంది. మంచు విష్ణు చెప్పినట్టుగానే పాన్ ఇండియా మూవీగా కన్నప్ప ట్రైలర్ నిరూపించింది. ట్రైలర్ లోకి వెళితే తిన్నడుగా మంచు విష్ణు లుక్, నాస్తికుడిగా శివయ్యను రాయిలా భావించే మంచు విష్ణు ని అక్షయ్ కుమార్ శివుడి రూపంలో తన భక్తుడిగా ఎలా మార్చుకున్నారు అనేది కన్నప్ప ట్రైలర్ సారాంశం.
అక్షయ్ కుమార్ కన్నప్ప ట్రైలర్ లో శివుడిగా స్క్రీన్ స్పేస్ కానివ్వండి, ఆయన లుక్స్ అన్ని నార్త్ ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసేవిలా ఉన్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర కేరక్టర్ లో చెప్పిన డైలాగ్స్, తిన్నడు తో పోరాడే ఘట్టాలు మేజర్ హైలెట్ గా నిలవనున్నాయని కన్నప్ప ట్రైలర్ తో కన్ ఫర్మ్ చేసారు. ప్రభాస్ కేరెక్టర్ లుక్, ఆయన డైలాగ్స్ అన్ని ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నాయి.
మలయాళ నటుడు మోహన్ లాల్, మోహన్ బాబు, తమిళ నటుడు శరత్ కుమార్ ఇలా ప్రతి కేరెక్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు,
కన్నప్ప లో ప్రతి కేరెక్టర్ లుక్స్, విజువల్ ఎఫెక్ట్స్, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కన్నప్ప ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. పార్వతిగా కాజల్ అగర్వాల్ అక్షయ్ కుమార్ పక్కన క్యూట్ గా కనిపించింది. ప్రతి భాషా నటులకు స్క్రీన్ స్పేస్ ఎంత ఉండబోతుందో కన్నప్ప ట్రైలర్ లోనే స్పష్టత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది.