Advertisementt

అఖండ 2 వైలెంట్-విశ్వంభర సైలెంట్

Thu 12th Jun 2025 11:58 AM
vishwambhara  అఖండ 2 వైలెంట్-విశ్వంభర సైలెంట్
Akhanda 2 Violent-Vishwambhara Silent అఖండ 2 వైలెంట్-విశ్వంభర సైలెంట్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం హడావిడి టాలీవుడ్ లో అంతా ఇంతా కాదు. బాలయ్య బర్త్ డే సందర్భంగా జూన్ 9 న వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. అంతేకాదు అఖండ 2 రిలీజ్ డేట్ కూడా లాక్ చేసారు మేకర్స్. సెప్టెంబర్ 25 దసరా స్పెషల్ గా అఖండ 2 తాండవం విడుదల అంటూ ప్రకటించారు. 

అంతేకాకుండా అఖండ టీజర్ 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ తెచ్చుకోవడం, అభిమానుల హడావిడి తో అఖండ 2 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అఖండ 2 తో బాలయ్య వైలెంట్ గా సందడి చేస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ విశ్వంభర సైలెంట్ గా కనిపించడం మెగా ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు. 

ఎప్పుడో జనవరి 10 నుంచి పోస్ట్ పోన్ అయిన విశ్వంభర కొత్త తేదీని ప్రకటించకపోవడమే కాదు, విశ్వంభర నుంచి ఇప్పటివరకు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్ కూడా రాకపోవడం మెగా అభిమానులను డిజప్పాయింట్ చేసింది. అన్ని సినిమాల రిలీజ్ తేదీలు వస్తున్నా విశ్వంభర రిలీజ్ తేదీ ఇవ్వకపోవడంపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. 

అందులోను బాలయ్య అఖండ 2 నుంచి అప్ డేట్స్ పర్వంలో నందమూరి అభిమానులు తడిచి ముద్దవుతూ చేస్తున్న హంగామా చూసి మెగా ఫ్యాన్స్ ఉడికిపోతున్నారు. మరి ఆ సైలెన్స్ ని విశ్వంభర ఎప్పుడు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Akhanda 2 Violent-Vishwambhara Silent:

Vishwambhara silence as Akhanda 2 races angers fans

Tags:   VISHWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ