Advertisementt

ఎన్టీఆర్‌ లుక్ పై కాస్ట్యూమ్ డిజైనర్ కామెంట్స్

Tue 10th Jun 2025 03:15 PM
ntr  ఎన్టీఆర్‌ లుక్ పై కాస్ట్యూమ్ డిజైనర్ కామెంట్స్
NTR styling in War 2 ఎన్టీఆర్‌ లుక్ పై కాస్ట్యూమ్ డిజైనర్ కామెంట్స్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వార్ 2 చిత్రం రానున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక ఈ టీజర్‌లో ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఇక తన కాస్ట్యూమ్స్‌కి, తన పని తనానికి వచ్చిన ప్రశంసలు, అభిమానుల నుంచి వచ్చిన ప్రేమను చూసి వార్ 2 కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఆశ్చర్యపోయారు.

దేశంలోనే అత్యుత్తమ స్టైలిస్ట్‌గా గౌరవించబడే అనైతా ఈ మేరకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వార్ 2లో మొదటిసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో పని చేయడం పూర్తిగా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తే ఆ ఎనర్జీ అంతా అందరిలోకి వచ్చేస్తుంటుంది. ఆయనలో ఏదో తెలియని ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుంది. 

తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంతో ఉల్లాసంగా ఉంచుతారు. ఆపై అతను పోషిస్తున్న పాత్రలో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా లుక్స్ డిజైన్ చేశాం. ఆయన పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాం. ఓ లక్ష్యంతో, ఉద్దేశ్యంతో పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశామని అన్నారు.

NTR styling in War 2 :

NTR styling in War 2 needed to show him like a human machine operating with purpose! : Anaita Shroff Adajania

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ