ముద్దుల మావయ్య కు నారా లోకేష్ విషెస్

ఈరోజు జూన్ 10. అంటే నందమూరి అభిమానులకు పండగ రోజు. జూన్ పది నందమూరి నటసింహ బాలకృష్ణ బర్త్ డే. మరి యాక్టర్ కమ్ పొలిటిషన్ బాలయ్య బర్త్ డే అంటే మాములుగా ఉంటుందా.. అభిమానుల కేక్ కటింగ్స్, అభిమానుల పూజలు, బాలయ్య కొత్త సినిమాల అప్ డేట్స్ అన్ని ఒక ఎత్తు, ఈ ఏడాది పద్మ భూషణుడిగా బాలయ్య బర్త్ డే వేడుకలు మరో ఎత్తు.
ఇక సోషల్ మీడియాలో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయన బావగారు ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర నుంచి ముద్దుల అల్లుడు నారా లోకేష్ వరకు, రాజకీయ, సినీప్రముఖులు అందిస్తున్న పుట్టిన రోజు శుభాకాంక్షలతో బాలయ్య తడిచిముద్దవుతున్నారు. నారా లోకేష్ తన మామగారు, మరియు మేనమామ బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా అందించిన బర్త్ డే విషెస్ మాత్రం ట్రెండ్ అవుతున్నాయి.
సిల్వర్ స్క్రీన్ పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్ స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ బాల మావయ్యను లోకేష్ విష్ చేసారు.
Nara Lokesh birthday wishes to Nandamuri Balakrishna
Nara Lokesh birthday wishes to Balakrishna







































