Advertisementt



రోజుకు 200 సిగ‌రెట్లు ఊదేసే మెగాస్టార్

Tue 10th Jun 2025 09:56 AM
amitabh  రోజుకు 200 సిగ‌రెట్లు ఊదేసే మెగాస్టార్
Amitabh once smoked 200 cigarettes a day రోజుకు 200 సిగ‌రెట్లు ఊదేసే మెగాస్టార్
Advertisement
Ads by CJ

అత‌డు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. మెగాస్టార్ గా నీరాజ‌నాలు అందుకున్నారు. అతడి తో ఒక్క సెల్ఫీ కోసం ఇంటి ముందు గంట‌ల త‌ర‌బ‌డి అభిమానులు ఎదురు చూస్తారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ అత‌డి హ‌వాకు ఎదురే లేదు. ఉత్త‌రాది ద‌క్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్లా అత‌డిని అభిమానిస్తారు. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ లెజెండ్స్ లో ఆయ‌న పేరు సుస్థిర‌మైన‌ది.

కానీ ఆయ‌న అల‌వాట్లు మాత్రం నిజంగా షాకిస్తాయి. ఆయ‌న నిరంత‌రం ఆల్క‌హాల్ సేవించేవాడు. మాంసాహారం తినేవాడు. వీట‌న్నిటినీ మించి రోజుకు 200 సిగరెట్లు ఊదేసేవాడు. అయితే ఇదంతా త‌న యంగ్ ఏజ్ లో చేసిన త‌ప్పులు అని కూడా అంగీక‌రిస్తారు. ఈ న‌టుడు మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్.

ఇప్పుడు త‌న ఇల్లు జ‌ల్సా ముందు ఎంద‌రో అభిమానుల‌తో ఆయ‌న సెల్ఫీలు, ఫోటోలు దిగుతారు. ఇప్ప‌టికీ బ్లాగులు రాస్తూ ఆనందంగా అన్ని విష‌యాల‌ను అభిమానుల‌తో షేర్ చేస్తారు. ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నారు. దీనికి కార‌ణం అల‌వాట్లు పూర్తిగా ఆయ‌న అదుపులో ఉన్నాయి. మందు తాగ‌డం మానేసారు. సిగ‌రెట్లు మానేసారు. కేవ‌లం విదేశాల్లో శాఖాహారం దొర‌క‌ని ప‌క్షంలో మాంసాహారం తింటారు. కానీ అది కూడా మానేశాన‌ని చెబుతున్నారు అమితాబ్. ప‌రిస్థితులే త‌న అల‌వాట్ల‌ను మాన్పించాయ‌ని తెలిపారు. మ‌ద్యం, సిగ‌రెట్లు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని తెలుసుకున్నాన‌ని అన్నారు. త‌న ఇంట్లో త‌న త‌ల్లి, భార్య మాంసాహారాన్ని ఆస్వాధిస్తారని, అయితే వారితో తానేమీ గొడ‌వ ప‌డ‌న‌ని తెలిపారు. త‌న తండ్రి హ‌రింశ‌రాయ్ బ‌చ్చ‌న్ మాత్రం పూర్తిగా శాఖాహారి అని వెల్ల‌డించారు.

Amitabh once smoked 200 cigarettes a day :

Amitabh Bachchan smoked 200 cigarettes a day

Tags:   AMITABH
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ