Advertisementt

ప్రెగ్నెన్సీ రూమర్స్ పై రవి గర్ల్ ఫ్రెండ్ క్లారిటీ

Mon 09th Jun 2025 09:22 PM
keneesha  ప్రెగ్నెన్సీ రూమర్స్ పై రవి గర్ల్ ఫ్రెండ్ క్లారిటీ
Is Kollywood Star girlfriend pregnant ప్రెగ్నెన్సీ రూమర్స్ పై రవి గర్ల్ ఫ్రెండ్ క్లారిటీ
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ కపుల్ జయం రవి-ఆర్తి విడాకుల కేసు ఎంత పెద్ద సన్సేషన్ అయ్యిందో అందరికి తెలిసిందే. జయం రవి వివాహ బంధంలో వేధింపులు భరించలేక భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నాను అని ప్రకటించారు. కానీ ఆర్తి జయం రవితో విడిపోవడానికి సన్నద్ధంగా లేను అంది, వీరి విడాకుల మేటర్ లో సింగర్ కేనీషా పేరు ప్రముఖంగా వినిపించింది. 

మూడో వ్యక్తి వలనే తమకు విడాకులయ్యాయంటూ ఆర్తి సోషల్ మీడియా వేదికగా కేనీషా పై ఇండైరెక్ట్ గా సెన్సేషనల్ కామెంట్లు పెట్టింది, అంతేకాదు జయం రవి నుంచి భరణం కింద నెలకు 40 లక్షలు డిమాండ్ చేసింది ఆర్తి. ఆ తర్వాత జయం రవి కేనీషా తో కలిసి కనిపించడంపై సోషల్ మీడియాలో కేనీషా పై అసభ్యకర ట్రోలింగ్ మొదలైంది. దానితో ఆమె పీఆర్ టీం కేనీషా పై ట్రోల్ చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవుతామని హెచ్ఛరించింది. 

ఆతర్వాత జయం రవి-కేనీషా వివాహం చేసుకున్నారంటూ పూల దండలు వేసుకున్న ఫోటో వైరలయ్యింది. అది టెంపుల్ లో పూజ చేసిన సందర్భంలో దండలు వేసుకున్నట్టుగా, వారికి పెళ్లి కాలేదు అంటూ సమాచారం రావడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. 

తాజాగా కేనీషా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దానితో కేనీషా తన ప్రెగ్నెన్సీ రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నాకు అందమైన సిక్స్ ప్యాక్ ఉంది, నేను గర్భవతిని కాను, ఎవరేం  చెప్పినా, మాట్లాడినా అది వారి ఖర్మ అనుభవిస్తారు. నిజం, అబద్దం ఏమిటి అనేది త్వరలోనే తెలుస్తాయి అంటూ కేనీషా చెప్పుకొచ్చింది. 

Is Kollywood Star girlfriend pregnant:

Ravi Mohan Rumored Lover Keneesha Reacts to Pregnancy Rumors

Tags:   KENEESHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ