Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Star family not seen at Akhil reception

అఖిల్ రిసెప్షన్ లో కనిపించని స్టార్ ఫ్యామిలీ

అక్కినేని నాగార్జున తన చిన్న కుమారుడు వివాహాన్ని జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లోనే కొద్దిమంది సన్నిహితుల నడుమ జరిపించేసి ఆదివారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియో లో అఖిల్-జైనాబ్ ల వివాహ రిసెప్షన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ మహేష్ ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీ ఇలా చాలామంది తారలు హాజరయ్యారు. 

రామ్ చరణ్ ఇంకా ఉపాసన అఖిల్ పెళ్లిలోనే కాదు, వెడ్డింగ్ రిసెప్షన్ లోను సందడి చేసారు. సుకుమార్ అండ్ ఫ్యామిలీ, సూర్య, హీరో   సుదీప్, కన్నడ స్టార్ యష్, వెంకీ అట్లూరి, రమ్యకృష్ణ, వెంకయ్య నాయుడు, రాఘవేంద్ర రావు.. కుర్ర హీరోలు నిఖిల్, అల్లరి నరేష్, నాని ఇలా చాలామంది హాజరయ్యారు. కాకపోతే అఖిల్ రిసెప్షన్ లో చాలామంది స్టార్ హీరోలు మిస్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కనిపించలేదు. 

అంతేకాదు అఖిల్ రిసెప్షన్ లో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కానీ ఆయన ఫ్యామిలీ కానీ కనబడలేదు. నాగార్జునకు బాలయ్యకు మద్యన డిస్టెన్స్ ఉంది అనేది మీడియా టాక్. అందుకే నాగ్ ఉన్న చోట బాలయ్య ఉండరు, బాలయ్య ఉన్న చోట నాగ్ ఉండరు అంటూ ఉంటారు. మరి అఖిల్ వివాహానికి బాలయ్యను నాగ్ ఆహ్వానించారా, నాగ్ ఆహ్వానించినా బాలయ్య రాలేదా అనేది ప్రస్తుతం మిస్టరీగా కనిపిస్తుంది. 

Akhil Akkineni, Zainab Ravdjee host grand star-studded reception

Star family not seen at Akhil reception
akhil