పవన్ పాలిట విలన్ లా తయారైన వర్మ

పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రాణం పెట్టిన పిఠాపురం వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిట విలన్ లా తయారయ్యారనేలా ప్రస్తుత పరిస్థితులు కాదు కాదు వర్మ గారి బిహేవియర్ కనిపిస్తుంది. తనకు జరిగిన అవమానాలకు వర్మ రివెంజ్ తీర్చుకుంటున్నారా అనేలా వర్మ చేస్తున్న పనులు, పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ విమర్శలు కానవస్తున్నాయి.
నాగబాబు ఎమ్యెల్సీ అయ్యాక నాగబాబు వర్మ విషయంలో చేసిన పనికి ప్రతీకారంగా వర్మ.. పిఠాపురంలో ఇసుక దోపిడిపై గళమెత్తారు. పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చెయ్యడమే కాదు, అక్కడి పోలిసుల తీరుని ఆయన ఎండగట్టడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ పై వర్మ ప్రతీకారానికి సిద్ధమయ్యారని మాట వినబడుతుంది.
ఒక్క చెరువుని నిర్మించేందుకు మాత్రమే డిప్యూటీ సీఎం పవన్ అనుమతి ఇచ్చారని.. కానీ కొంతమంది అదే అదునుగా రెచ్చిపోతున్నారంటూ వర్మ మాట్లాడారు, అంతేకాదు పోలీసులకు తగిన మొత్తంలో రావాల్సినవి, కావాల్సినవి అందుతున్నాయని.. అందుకే ఇంత అక్రమాలు జరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు అంటూ వర్మ వ్యాఖ్యానించారు.
వర్మ రియాక్షన్ టీడీపీ కి జనసేనకు మింగుడు పడడం లేదు, వర్మను సముదాయిద్దామంటే జనసేన కార్యకర్తలు వర్మపై ఒంటికాలిపై లేస్తున్నారు, పోనీ జనసేనను తగ్గమంటే టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో కూటమి ప్రభుత్వంలో బీటలు వాలే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.
Pithapuram SVSN Varma Shocking Comments On Janasena Leaders
SVSN Varma indirect comments on Pawan Kalyan







































