Advertisement

ఆ మూడు చిత్రాలకు వీరమల్లు టెన్షన్

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం హరి హర వీరమల్లు రిలీజ్ తేదీ మరీ కామెడీగా తయారైంది. పవన్ కళ్యాణ్ సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో సినిమాని మేకర్స్ పదే పదే వాయిదాలు వేసుకుంటూ వస్తూ అలా అలా నాలుగేళ్లు సినిమాని సెట్ పైనే ఉంచారు. ఎట్టకేలకు సినిమా పూర్తయ్యి హరి బరిగా సినిమాను వదిలించుకుందామనుకుంటే అది మార్కెట్ అవ్వక జూన్ 12 నుంచి మరోమారు పోస్ట్ పోన్ అయ్యేందుకు సిద్ధమైంది. 

నిర్మాత ఏ ఏం రత్నానికి హరి హర వీరమల్లు తలకు మించిన భారంగా తయారైంది. జూన్ 12 నుంచి పోస్ట్ పోన్ చేసిన సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలనే విషయంలో మేకర్స్ మూడు తేదీలను ఆలోచించారు, మరోపక్క ఓటీటీ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వారు వీరమల్లు మేకర్స్ ని ప్రెజర్ చేస్తున్నారు. సినిమాని విడుదల చేయకుండా జాప్యం చేయడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. 

తాజాగా హరి హర వీరమల్లును కన్నప్ప డేట్ అంటే జూన్ 27 కైనా, లేదంటే కింగ్ డమ్ డేట్ జులై 4 అయినా, అది కాదు అంటే జులై 11 అంటే అనుష్క ఘాటీ రిలీజ్ డేట్ కైనా వదిలేందుకు మేకర్స్ మూడు తేదీలను పక్కనపెట్టుకున్నారని, అమెజాన్ ప్రైమ్ ఈమూడు తేదీల్లో దేనికి ఓకే చెబితే అది ఫైనల్ చేస్తారని టాక్ వినబడకుండి. రేపో మాపో వీరమల్లు కొత్త తేదీ రావడమైతే ఖాయమవుతుంది అంటున్నారు. 

ఒకవేళ పై డేట్స్ లో వీరమల్లు దేనిని చూజ్ చేసుకున్నా ఆ మూడు చిత్రాలకు దేనికో దానికి వీరమల్లు ఎఫెక్ట్ పడుతుంది అనడంలో సందేహం లేదు. 

Amazon to finalize new date of Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu Postponed Again
hari hara veera mallu