జగన్ మోహన్ రెడ్డి ని బ్లూ మీడియా ఎగతాళి చేస్తుంది. వైసీపీ లో వెన్నుపోటుదారుడు ఎవరూ లేదు, వైసీపీ కి ఉన్న వెన్నుపోటు దారుడు జగనే అంటూ బ్లూ మీడియా వెటకారంగా, ఎగతాళిగా న్యూస్ లు రాస్తుంది. కారణం జగన్ గతంలో ప్రజలను పట్టించుకోలేదు, అధికారంలో ఉండి ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోని జగన్ అధికారం పోయాక అయినా మారతారని అందరూ అనుకున్నారు కానీ మారలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ వైఫల్యాలపై పోరాటాలకు పిలుపునిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఆ పోరాటాల్లో పాల్గొనకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యాలనేది జగన్ పాలసీ. ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవ ర్యాలీకి పిలుపునిచ్చిన జగన్.. ఆయన వెళ్లకుండానే నేతలను, కార్యకర్తలను పంపించడం పై బ్లూ మీడియా సెటైర్స్ వేస్తుంది.
వైసీపీ కి వెన్నుపోటు దారుడు ఎక్కడో లేడు, జగన్ రూపంలోనే వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటూ ఆర్టికల్స్ రాస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా చేపట్టే కార్యక్రమాలకు జగన్ వెళ్తే బావుంటుంది కానీ.. కేవలం నేతలు మాత్రమే వెళితే ఏం బావుంటుంది. జగన్ కూడా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి కానీ.. జగన్ వెళ్లకుండా కేవలం నేతలు మాత్రమే వెళితే అది ప్రజల్లోకి బలంగా వెళ్ళదు అంటూ వైసీపీ నేతలే మాట్లాడుకోవడం గమనార్హం.




                     
                      
                      
                     
                    
 కమల్ బాలీవుడ్ వదిలేయడానికి కారణం

 Loading..