Advertisement

Ads by CJ

థగ్ లైఫ్ ఓవర్సీస్ రివ్యూ

Thu 05th Jun 2025 08:00 AM
thug life  థగ్ లైఫ్ ఓవర్సీస్ రివ్యూ
Thug Life Overseas Review థగ్ లైఫ్ ఓవర్సీస్ రివ్యూ
Advertisement
Ads by CJ

కమల్ హాసన్-మణిరత్నం కలయికలో శింబు, త్రిష కీలక పాత్రల్లో తెరకెక్కిన థగ్ లైఫ్ చిత్రం నేడు జూన్ 5 పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థగ్ లైఫ్ ప్రమోషన్స్ తోనే దర్శకుడు మణి రత్నం, హీరో కమల్ హాసన్, శింబు, త్రిష లు సినిమాపై అంచనాలు పెంచేశారు. గత రెండు నెలలుగా థగ్ లైఫ్ ప్రమోషన్స్ చాలా భారీగా నిర్వహించారు. చెన్నై, హైదరాబాద్, వైజాగ్ ఇలా ప్రతి ఒక్కచోట సినిమాని బాగా ప్రమోట్ చేసింది టీమ్. 

థగ్ లైఫ్ ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తి కావడంతో ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా థగ్ లైఫ్ విశేషాలను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. థగ్ లైఫ్ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే..  పవర్ కోసం కొట్లాడుకొనే ఇద్దరు వ్యక్తుల కథ ఈ థగ్ లైఫ్. సినిమా ఫస్ట్ హాఫ్ మరీ సూపర్బ్ గా లేకపోయినా.. బావుంది, కమల్ హాసన్ పర్ఫామెన్స్, రెహమాన్ బీజీఎం, శింబు యాక్టింగ్ అన్ని ఫస్ట్ హాఫ్‌కు ప్లస్ అంటూ కొంతమంది ఆడియన్స్ థగ్ లైఫ్ చూసి మాట్లాడుకుంటున్నారు. 

థగ్ లైఫ్ చాలా పాత కథ. సినిమా ల్యాగ్‌గా ఉంది. పెద్దగా ఇంప్రెసివ్ కంటెంట్ కనిపించలేదు. పాత స్క్రీన్ ప్లే, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అంతగా గొప్పగా లేదు. కానీ శింబు యాక్టింగ్ వేరే లెవల్, ఆయన నటించలేదు.. తన పాత్రలో జీవించేశాడు, శింబు కనిపించిన ప్రతీ సీన్ అద్భుతంగా ఉందని, ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ అంటూ కొంతమంది ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

ఫస్టాఫ్‌ బావుంది, ఫస్టాఫ్‌లో హైలెట్స్ ఏమిటంటే.. కమల్ వన్ మ్యాన్ షో, కమల్, శింబు పోటాపోటీగా నటించిన సన్నివేశాలు బాగున్నాయి. వారి మధ్యన వచ్చే యాక్షన్ సీన్స్ అన్ని సినిమాకి హైలెట్. కథ ఎంగేజింగ్‌గా ఉంది అని అంటుంటే, మరికొందరు మణిరత్నం తీసిన నవాబ్‌కి రెండో పార్ట్‌లా ఉంది ఈ థగ్ లైఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి థగ్ లైఫ్ అసలు కథ ఏమిటి అనేది రివ్యూ లో మరికాసేపట్లో తెలుసుకుందాం. 

Thug Life Overseas Review:

Thug Life social media Review

Tags:   THUG LIFE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ